World Telecommunications Day 2024: ప్రజల జీవితంలో కమ్యూనికేషన్ ఒక ముఖ్యమైన భాగం. గతంలో ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ కోసం ముఖాముఖి కలవడం తప్పనిసరి. లేదా లెటర్ల ద్వారా కమ్యూనికేషన్ చేయాల్సి వచ్చేది. వీటికి అతీతంగా టెలిఫోన్ కనెక్షన్ కనిపెట్టిన తర్వాత టెక్నాలజీ యుగం మొదలైంది. నేడు మనం డిజిటల్ యుగంలో ఉన్నాం. ఇంటర్నెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ మార్గంగా మారిపోయింది. దీంతో ప్రపంచంలో ఏమూల ఉన్నవారితోనైనా చాలా ఈజీగా కమ్యూనికేట్ అయిపోతున్నాం. ఈ టెలికమ్యూనికేషన్ ద్వారా కమ్యూనికేట్ చేయడం, దేశంలో జరుగుతున్న సంఘటనలను తెలుసుకోవడానికి ఇంటర్నెట్ సహాయపడుతుంది. కమ్యూనికేషన్ కొత్త పుంతలు తొక్కుతున్న ఈరోజుల్లో కమ్యూనికేషన్ ప్రాధాన్యతను అందరికీ గుర్తు చేసేవిధంగా ప్రతి ఏటా మే 17న ప్రపంచ టెలికమ్యూనికేషన్ డే గా జరుపుకుంటారు. ఎందుకు ఈరోజు టెలి కమ్యూనికేషన్ డే నిర్వహిస్తారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోజే ఎందుకు?
World Telecommunications Day 2024: 1865 సంవత్సరంలో, మొదటి ఇండియన్ టెలిగ్రాఫ్ కన్వెన్షన్ సంతకంతో అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ ప్రారంభం అయింది. 2005లో, వరల్డ్ సమ్మిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ ప్రతి సంవత్సరం మే 17ని ప్రపంచ టెలికమ్యూనికేషన్ డేగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితిని కోరింది. అందుకే, మే 17న ప్రపంచ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ దీనిని నిర్వహిస్తుంది.
World Telecommunications Day 2024: టెలికమ్యూనికేషన్ అనేది ఎలక్ట్రానిక్ సాధనాల సహాయంతో ముఖ్యమైన దూరాలకు సమాచార మార్పిడిని సూచిస్తుంది. టెలికమ్యూనికేషన్ ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెచ్చింది. ఇది దూరంగా ఉండే వ్యక్తులకు మరింత దగ్గర చేయడంలో సహాయపడింది. టెలికమ్యూనికేషన్ ప్రపంచాన్ని మరింత దగ్గర చేసింది. అయినప్పటికీ, యాక్సెస్ - డిజిటల్ పరిజ్ఞానం పరంగా ఇప్పటికీ అసమానత ఉంది. ప్రతి సంవత్సరం, టెలికమ్యూనికేషన్ ప్రాముఖ్యతను జరుపుకోవడానికి - అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఏర్పాటు తేదీని గుర్తించడానికి ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
Also Read: 70 థియేటర్లు మూసివేస్తున్నట్లు ప్రకటించిన పీవీఆర్ ఐనాక్స్ సంస్థ..!
World Telecommunications Day 2024: ఈ టెలికమ్యూనికేషన్ డే సందర్భంగా టెలికమ్యూనికేషన్ ప్రాముఖ్యతను తెలియజేయడం, సామాజిక జీవితంలో అది పోషిస్తున్న కీలక పాత్రపై అవగాహన పెంచడం చేసే కార్యక్రమాలను నిర్వహిస్తారు. అంతేకాకుండా, ఇంటర్నెట్ కనెక్టివిటీతో సహా కొత్త సాంకేతికతల కారణంగా జరుగుతున్న సామాజిక మరియు సమాజ మార్పుల గురించి ప్రపంచ స్థాయిలో అవగాహన కల్పించడం దీని లక్ష్యం. ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం ఈ రంగంలో సాంకేతికత అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సంవత్సరం థీమ్ ఇదే..
World Telecommunications Day 2024: ఈ సంవత్సరం ప్రపంచ టెలికమ్యూనికేషన్ డే థీమ్ - స్థిరమైన అభివృద్ధి కోసం డిజిటల్ ఆవిష్కరణ. “వాతావరణ మార్పులతో పోరాడటం నుండి ఆకలి మరియు పేదరిక నిర్మూలన వరకు ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవటానికి ఇన్నోవేటివ్ టెక్ సహాయపడుతుంది. వాస్తవానికి, డిజిటల్ టెక్నాలజీలు 2030 నాటికి UN సుస్థిర అభివృద్ధి లక్ష్యాల క్రింద 70% లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయి. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో విధానాలు, పెట్టుబడి, డిజిటల్ నైపుణ్యాలు లేకపోవడం వల్ల చాలా దేశాలు వేగంగా మారుతున్న డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌లో కొనసాగడానికి కష్టపడుతున్నాయి" అని ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ తన అధికారిక వెబ్‌సైట్‌లో రాసింది. ICT అభివృద్ధి - అప్లికేషన్ సాధించిన విజయాలు, ఎదురవుతున్న ఇబ్బందుల గురించి చర్చించడానికి ఈ రోజు ఒక వేదికను అందిస్తుంది. డిజిటల్ ఇన్‌క్లూజన్,టెక్నాలజీ సహాయంతో స్థిరమైన అభివృద్ధి ప్రపంచ టెలికమ్యూనికేషన్ డే ముఖ్య లక్ష్యం.