World Teacher's day: గౌరవం ఉంది.. జీతాలే లేవు.. ఇండియాలో టీచర్ల శాలరీలు ఇంత తక్కువా?

ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ఏటా అక్టోబర్ 5న వస్తుంది. విద్యార్థి దశ నుంచే జ్ఞానంతో పాటు జీవితంలో వెలుగులు నింపే టీచర్‌కు ఇండియాలో శాలరీలు చాలా తక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. చాలా మంది భారతీయ ఉపాధ్యాయులు కాంట్రాక్ట్ లేకుండానే పనిచేస్తుండగా.. వారి జీతం నెలకు సగటున రూ.10వేలు మాత్రమేనని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

World Teacher's day: గౌరవం ఉంది.. జీతాలే లేవు.. ఇండియాలో టీచర్ల శాలరీలు ఇంత తక్కువా?
New Update

'గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరహ...' అని టీచర్లను దేవుడిగా పూజించే దేశం మనది. మన జీవితంలో విద్యార్థి దశ నుంచి టీచర్ల పాత్ర మొదలవుతుంది. మనం వేసే ప్రతి అడుగులోనూ గురువు ఉంటాడు. చాలా మంది టీచర్లు(Teachers) మంచి విషయాలే బోధిస్తారు. ఎక్కడో కొందరు తప్ప అంతా మంచే నేర్పుతారు. బాల్యం నుంచే మన టీచర్ల ప్రభావం మనపై కనిపిస్తుంది. మన ఎదుగుదలకు కారణమయ్యే టీచర్లను స్మరించుకునేందుకు సెప్టెంబర్‌ 5న దేశవ్యాప్తంగా టీచర్స్ డే జరుపుకుంటారు.. అక్టోబర్‌ 5న(రేపు) ప్రపంచ టీచర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ రోజు మన జీవితాలను రూపొందించడంలో, మార్చడంలో ఉపాధ్యాయులు పోషించే పాత్రను గౌరవిస్తుంది. మన తల్లిదండ్రుల తరువాత, సమాజానికి సానుకూలంగా దోహదపడే పెద్దలు టీచర్లే. అలాంటి టీచర్లకు తక్కువ జీతాలు ఇస్తున్న దేశాల్లో ఇండియా కూడా ఒకటి.

publive-image ప్రతీకాత్మక చిత్రం

అదే టీచర్ల బాధ:
దేశ భవిష్యత్తును పెంపొందించి నిర్మించగల ఉదాత్తమైన వృత్తుల్లో ఉపాధ్యాయ వృత్తి ఒకటి. చదువుకున్న ఉపాధ్యాయుడు లేకపోతే దేశ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. "బోధనను ఉదాత్తంగా భావించినప్పటికీ, ఈ వృత్తికి తక్కువ ప్రశంసలు లభిస్తున్నాయి. అప్పటి నుంచి ఉపాధ్యాయుల ఆందోళనలు అలాగే ఉండి మరింత తీవ్రమయ్యాయి' అని ఢిల్లీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు వాపోతున్నారు. విద్యార్థి - ఉపాధ్యాయుడి నిష్పత్తి కూడా ఇండియాలో చాలా దారుణంగా ఉంటుంది. యునెస్కో 2021 నివేదిక ప్రకారం మన దేశంలో సుమారు 1.1 లక్షల పాఠశాలలు 'సింగిల్ టీచర్ సంస్థల'గా ఉన్నాయి.

publive-image ప్రతీకాత్మక చిత్రం

టీచర్లు ఏం అంటున్నారు?
ఢిల్లీలోని ఓ ప్రముఖ ప్రైవేటు పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడు మాట్లాడుతూ.. 'నేను గత 13 ఏళ్లుగా ఇక్కడ తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్నాను. దయచేసి నా ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయమని నేను వారిని అడిగినప్పుడు, వారు (పాఠశాల అధికారులు) మేము విధివిధానాలపై పనిచేస్తున్నామని చెప్పారు. బహుశా ఆ తర్వాత నేను ఏదైనా చెబితే, అది నా ఉద్యోగానికి నష్టం కలిగిస్తుంది." 2021 యునెస్కో నివేదిక ప్రకారం ప్రైవేట్, ప్రభుత్వ రెండింటిలోనూ 42 శాతం మంది భారతీయ ఉపాధ్యాయులు కాంట్రాక్ట్ లేకుండా పనిచేస్తున్నారు. నెలకు సగటున రూ .10,000 కంటే తక్కువ జీతం పొందుతున్నారని చెప్పారు. ప్రైవేటు పాఠశాలల్లో పరిస్థితి దారుణంగా ఉందని, కాంట్రాక్టులు లేకుండా పనిచేస్తున్నఉపాధ్యాయులకు జీతాల్లో కోత, వేతనం వాయిదా, పెరిగిన పనిభారానికి గురవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. జాబ్‌లో నుంచి ఎప్పుడు ఉంచుతారో ఎప్పుడు తీసి వేస్తారో కూడా తెలియని పరిస్థితులున్నాయి.15-20 సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ పాఠశాలలో మెజారిటీ ఉపాధ్యాయులు నెలకు రూ .10 వేలు మాత్రమే సంపాదిస్తున్నారు. అకడమిక్స్ తో పాటు నాన్ కరిక్యులర్ యాక్టివిటీస్‌లో కూడా టీచర్లు పని చేయాల్సి ఉంటుంది. నిర్దిష్ట పద్ధతిలో బోధించాలని పాఠశాల యాజమాన్యం నుంచి ఒత్తిడి ఉంటుంది. అయినా జీతాలు తక్కువే.

CLICK HERE TO VIEW RTV WHATSAPP CHANNEL: మరిన్ని ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ కావాలా? ఆర్టీవీ వాట్సాప్‌ ఛానెల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేసి వార్తలను చూడండి

ALSO READ: మరో గోల్డ్ కొట్టిన బల్లెం వీరుడు.. ఏషియన్‌ గేమ్స్‌లో నీరజ్‌ చోప్రా సత్తా!

#world-teachers-day
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe