World Teacher's day: గౌరవం ఉంది.. జీతాలే లేవు.. ఇండియాలో టీచర్ల శాలరీలు ఇంత తక్కువా?
ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ఏటా అక్టోబర్ 5న వస్తుంది. విద్యార్థి దశ నుంచే జ్ఞానంతో పాటు జీవితంలో వెలుగులు నింపే టీచర్‌కు ఇండియాలో శాలరీలు చాలా తక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. చాలా మంది భారతీయ ఉపాధ్యాయులు కాంట్రాక్ట్ లేకుండానే పనిచేస్తుండగా.. వారి జీతం నెలకు సగటున రూ.10వేలు మాత్రమేనని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.