World Population Day 2024: భారతదేశంలో పెరుగుతున్న జనాభా ఒకప్పుడు ఆందోళన కలిగించే అంశంగా ఉండేది. అయితే ప్రస్తుతం అది పెద్ద ఆందోళన చెందాల్సిన విషయంగా లేదు. గత నాలుగు దశాబ్దాల్లో జనాభా పెరుగుదల వేగంలో చోటుచేసుకున్న మార్పులు జనాభా పెరుగుదలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం. ఈ సందర్భంగా భారతదేశ జనాభా గణాంకాలపై స్పెషల్ స్టోరీ ఇది.
World Population Day 2024: 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి, భారతదేశ జనాభా ఒక బిలియన్ కంటే ఎక్కువగా పెరిగింది. రాబోయే 40 ఏళ్లలో జనాభా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కానీ, జనాభా పెరుగుదల రేటు కూడా దశాబ్దాలుగా పడిపోతూ వస్తోంది. దీంతో ఇప్పుడు భారతదేశం జన విస్ఫోటన ప్రమాదం నుండి బయటపడే దిశగా పయనిస్తోంది.
క్షీణిస్తున్న వృద్ధిరేటు..
1971 మరియు 1981 మధ్య, భారతదేశ జనాభా ప్రతి సంవత్సరం సగటున 2.2% పెరుగుతూ వచ్చింది. అయితే, దీని తర్వాత వృద్ధి రేటు క్షీణించడం ప్రారంభించింది. 2001 - 2011 మధ్యకాలంలో వృద్ధి రేటు మందగించింది. అప్పుడు ఇది 1.5%గా ఉంది. ఇప్పుడు అది కూడా తగ్గింది. ఇదిలా ఉండగా, భారతదేశంలో సంతానోత్పత్తి రేటు కూడా గణనీయంగా తగ్గింది. అయితే భవిష్యత్తులో మరణాల రేటు పెరుగుతుందని అంచనా. జనాభా నియంత్రణలో ఈ వాస్తవం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే, 2060లలో భారతదేశం జనాభా గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఆ తర్వాత భారతదేశంలో జనాభా తగ్గడం ప్రారంభమవుతుంది.
జనాభా మెరుగుదల సానుకూల సంకేతాలు ఇవే..
World Population Day 2024: వృద్ధిరేటు: దేశ జనాభా పెరుగుదల రేటు దాదాపు ప్రపంచంతో సమానంగా ఉంది. 1951 జనాభా లెక్కల నాటికి భారతదేశ జనాభా 36 కోట్లు కాగా, 1980-81 నాటికి అది దాదాపు 70 కోట్లకు పెరిగింది. కానీ అదే 1980లలో భారతదేశ జనాభా వృద్ధి రేటు క్షీణించడం ప్రారంభించింది. వార్షిక జనాభా వృద్ధి రేటు 2020లో ప్రపంచ సగటు కంటే తక్కువగా పడిపోయింది. ఇప్పుడు ఈ వ్యత్యాసం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
1950లో భారతదేశంలో జనాభా వార్షిక వృద్ధి రేటు 2.2 శాతం. ఆ సమయంలో ప్రపంచ జనాభా వృద్ధి రేటు ఏటా 1.7 శాతం. 2023-24లో ప్రపంచం - భారతదేశం రెండింటి వార్షిక వృద్ధి రేటు 0.9 శాతం. 2065-66లో వృద్ధి రేటు సున్నాగా ఉంటుందని అంచనా. అయితే దీని తర్వాత వృద్ధి రేటు మైనస్‌లోకి వెళ్లవచ్చు. అంటే జనాభా తగ్గడం మొదలవుతుంది.
కుటుంబాల పరిమాణం..
World Population Day 2024: దేశంలో తగ్గుతున్న జనాభా పెరుగుదల రేటు కూడా కుటుంబాల పరిమాణంపై ప్రభావం చూపుతోంది. చిన్న కుటుంబాల సంఖ్య పెరుగుతోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, 2019 - 2021 మధ్య, చాలా కుటుంబాలలో సభ్యుల సంఖ్య మూడు నుండి ఐదు వరకు ఉంది. 1970 - 1980లలో, కుటుంబాలు 5 నుండి 6 మంది సభ్యులను కలిగి ఉన్నాయి.
ప్రస్తుతం 23 శాతానికి పైగా కుటుంబాల్లో నలుగురు సభ్యులున్నారు. తొమ్మిది కంటే ఎక్కువ మంది సభ్యులున్న కుటుంబాలు దేశంలో కేవలం 4 శాతం మాత్రమే ఉన్నాయి. అయితే, 5 లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్న కుటుంబాల వాటా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ. కుటుంబాల చిన్న పరిమాణం కూడా జనాభా నియంత్రణకు సూచనగా చెప్పవచ్చు.
సంతానోత్పత్తి రేటు..
25 సంవత్సరాలలో సంతానోత్పత్తి రేటు 1.29 మాత్రమే ఉంటుంది. అంటే World Population Day 2024: ఇప్పుడున్న జనాభా మెయింటెయిన్ చేయలేకపోతుంది. అయితే, భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు పడిపోతోంది. ఇందులో భారతదేశంలోని రాష్ట్రాల మధ్య కూడా చాలా తేడా ఉంది. దక్షిణ - పశ్చిమ రాష్ట్రాలలో, మొత్తం సంతానోత్పత్తి రేటు ఇప్పటికే ఇతర రాష్ట్రాల కంటే తక్కువగా ఉంది. 1950లో భారతదేశంలో సంతానోత్పత్తి రేటు 5.73. ఆ సమయంలో ప్రపంచంలో ఈ సంఖ్య 4.86. 2023లో భారతదేశంలో సంతానోత్పత్తి రేటు 2. కాగా గ్లోబల్ 2.31గా ఉంది. 2050 నాటికి అది 1.29కి పడిపోతుందని అంచనా. అయితే 2100 నాటికి భారతదేశంలో సంతానోత్పత్తి రేటు ఆందోళనకర స్థాయి 1.04ని తాకవచ్చని భావిస్తున్నారు.
జనన - మరణాల మధ్య వ్యత్యాసం..
పెరుగుతున్న వయస్సుతో జనన - మరణాల రేటు పెరుగుతుంది. ఇది ఇప్పటివరకు సంతానోత్పత్తి క్షీణత కారణంగా ఉంది. కానీ భవిష్యత్తులో, పెరుగుతున్న మరణాల రేట్లు కూడా ఈ విషయంలో పాత్ర పోషిస్తాయి. 1950లో ఏటా 1.56 కోట్ల మంది పుడుతున్నారు. కాగా 79 లక్షల మంది మరణిస్తున్నారు. 2024లో 2.3 కోట్ల జననాలు, 95 లక్షల మరణాలు సంభవిస్తాయని అంచనా. జనాభా సగటు వయస్సు పెరుగుతున్న కొద్దీ ఈ సంఖ్య వేగంగా పెరగవచ్చు. 2065లో, జననాన - మరణాలు సమానంగా ఉంటాయని అంచనా వేశారు. అంటే దాదాపు 1.76 కోట్లు. 2100 సంవత్సరంలో మరణాలు 2 కోట్లకు పైగా ఉంటాయని, జననాలు 1.3 కోట్లు ఉంటాయని లెక్కలు వేస్తున్నారు.
లింగ నిష్పత్తి పరంగా..
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తాజా డేటా ప్రకారం, లింగ నిష్పత్తి 100 మంది స్త్రీలకు 106.453 మంది. ఈ నిష్పత్తి 2100 సంవత్సరంలో 101.944కి తగ్గుతుందని అంచనా. అయితే లింగ నిష్పత్తిలో దక్షిణాది రాష్ట్రాలు మెరుగ్గా ఉన్నాయి. కేరళలో వెయ్యి మంది పురుషులకు 1084 మంది మహిళలు, తమిళనాడులో 995 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 992 మంది ఉన్నారు. హర్యానాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 877 మంది మహిళలు మాత్రమే ఉన్నారు.
అంచనా వేసిన గణాంకాలు ఇవే..
అభివృద్ధి చెందిన దేశాల కంటే భారతీయ నగరాల్లో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉంది..
భారతీయ జనాభాకు సంబంధించిన కొన్ని గణాంకాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. ఉదాహరణకు, కొన్ని నగరాల్లో సంతానోత్పత్తి రేటు ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల కంటే కూడా తక్కువగా ఉంది. అదేవిధంగా దేశంలోని ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటులో వ్యత్యాసం కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల కంటే సంతానోత్పత్తి రేటు ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ ప్రాంతాల్లో 1.47 శాతంగా ఉంది. కాగా నార్వేలో ఇది 1.50 శాతం. సంతానోత్పత్తి రేటు అంటే ప్రతి స్త్రీ ఎంతమంది పిల్లలకు జన్మనిస్తోంది.
ఇలాంటి మరికొన్ని ఉదాహరణలు..
ప్రపంచంలోని ఈ రాష్ట్రాల నగరాల్లో సంతానోత్పత్తి రేటు మహారాష్ట్ర 1.50 జర్మనీ 1.53 కర్ణాటక 1.50 UK 1.56 గుజరాత్ 1.65 అమెరికా 1.66 తెలంగాణ 1.75 ఫ్రాన్స్ 1.79 ఆంధ్రప్రదేశ్ 1.47 నార్వే 1.50గా ఉంది.
బీహార్‌లో అత్యధిక వృద్ధి రేటు
రాష్ట్రాలలో, బీహార్ 2024లో అత్యధిక జనాభా వృద్ధి రేటును 1.44% కలిగి ఉంది, తర్వాత జార్ఖండ్ 1.25%, గుజరాత్ 1.20% ఉన్నాయి. రాష్ట్రాలలో తమిళనాడు అత్యల్ప వృద్ధి రేటు 0.30 శాతంగా ఉంది. 2050లో జనాభా సగటు వయస్సు 38.7 సంవత్సరాలుగా ఉండవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో జనాభా సగటు వయస్సు 28.62 సంవత్సరాలుగా ఉంది. ప్రస్తుతం, భారతదేశంలో జనాభా సగటు వయస్సు 28.62 సంవత్సరాలు, అయితే ప్రపంచంలోని ప్రజల సగటు వయస్సు 30.74 సంవత్సరాలు. రాబోయే కొన్నేళ్లలో ఈ పరిస్థితి మారనుంది. 2050లో, భారతదేశంలో ప్రజల సగటు వయస్సు 38.7 ఉంటుంది. ప్రపంచ జనాభా సగటు వయస్సు 35.92 ఉంటుంది.
భారతదేశ జనాభా అంచనా.. ఈరోజు.. రేపు..
- మొత్తం ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా 17.7% వాటాను కలిగి ఉంది.
- 2060 నాటికి భారతదేశంలో 1.7 బిలియన్ల మంది ఉంటారు. ఇది భారతదేశ జనాభాలో గరిష్ట స్థాయి అవుతుంది. UN అంచనాల ప్రకారం.
- భారతదేశంలో చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో 481 మంది నివసిస్తున్నారు.
- జనాభాలో 36.3% పట్టణ ప్రజలు (2023లో దాదాపు 52 కోట్లు). దేశ జనాభాలో అత్యధికులు ఇప్పటికీ గ్రామాల్లోనే నివసిస్తున్నారు.
- (ఈ డేటా వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ - 2022, వివిధ ఐక్యరాజ్యసమితి నివేదికలు, భారత జనాభా లెక్కలు, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఆధారంగా ఇవ్వడం జరిగింది)
ప్రపంచంపై భారతీయ జనాభా ప్రభావం..
దేశం వెలుపల 3.54 కోట్ల మంది భారతీయులున్నారు. కెనడాకు వెళ్లే వారి సంఖ్య 326 శాతం పెరిగింది. ఇప్పుడు ప్రపంచంలో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, విదేశాలలో ఉన్న భారతీయుల మొత్తం జనాభా 3 కోట్ల 54 కంటే ఎక్కువ. వీరిలో 1 కోటి 58 లక్షల మంది ఎన్నారైలు. 1 కోటి 95 లక్షల మందికి పైగా భారతీయ సంతతికి చెందిన వారు ఉన్నారు. భారతీయ జనాభా ముఖ్యమైన కొన్ని దేశాల గురించి తెలుసుకుందాం-
72 అమెరికా యునికార్న్‌లలో భారతీయ సహ వ్యవస్థాపకులు..
అమెరికాలో 40 లక్షల మందికి పైగా భారతీయులు ఉన్నారు. ఇది అక్కడి జనాభాలో దాదాపు 1.5%. 27 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 16 కంపెనీలకు భారతీయ సంతతికి చెందిన CEOలు నాయకత్వం వహిస్తున్నారు. ఈ కంపెనీల ఆదాయం ఒక ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. అమెరికాలోని 648 యునికార్న్‌లలో 72 వాటికి భారతీయ సహ వ్యవస్థాపకులు ఉన్నారు.
కెనడా కు వెళుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్యలో పెరుగుదల..
కెనడాలో ఎన్నారైలు 1.78 లక్షలకు పైగా ఉన్నారు. భారత సంతతికి చెందిన వారి జనాభా 15.10 లక్షల కంటే ఎక్కువ. 2013 - 2023 మధ్య, భారతీయులు 32,828 నుండి 139,715కి పెరిగారు. అంటే 326% పెరిగింది. 2016 - 2019 మధ్య కెనడియన్ విశ్వవిద్యాలయాలలో భారతీయ విద్యార్థులు 182% పెరిగారు.
యూకే ఆర్థిక వ్యవస్థకు 6 నుండి 7 శాతం భారతీయుల సహకారం
UKలో ప్రవాస భారతీయుల జనాభా 3 లక్షల 51 వేలు. కాగా భారత సంతతికి చెందిన వారి జనాభా 1 లక్షా 41 వేలకు పైగా ఉంది. ఇది అక్కడి మొత్తం జనాభాలో 2 నుంచి 3 శాతం. UK ఆర్థిక వ్యవస్థకు భారతీయ జనాభా సహకారం 6 నుండి 7 శాతం మధ్య ఉంది, ఇది చాలా ముఖ్యమైనది.
UAEలో 30% కంటే ఎక్కువ మంది భారతీయులు..
UAEలో ప్రవాస భారతీయుల సంఖ్య 35 లక్షలకు పైగా ఉంది. భారతీయ డయాస్పోరా ఇక్కడ అతిపెద్ద జాతి సంఘం. వీరు దేశ జనాభాలో 30 శాతానికి పైగా ఉన్నారు. యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమన్ వంటి గల్ఫ్ దేశాల్లో 80 లక్షల మందికి పైగా భారతీయులు ఉన్నారు.