World Nature Day: ప్రకృతిలోని ఆ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తే ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే.

ప్రకృతి మానవుడి మానసిక ఆరోగ్యానికి మంచి మాత్రలా పనిచేస్తుంది. అలాంటిది ఈ మధ్య కాలంలో పనుల్లో బిజీ బిజీ గా ఉంటూ ప్రకృతిని ఆస్వాదించలేకపోతున్నారు.. కానీ ప్రకృతిలో కాసేపు ఉంటే చాలు శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి.

New Update
World Nature Day: ప్రకృతిలోని ఆ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తే ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే.

World Nature Day 2023:  మానవుడి శ్రేయస్సుకు, ఆరోగ్యానికి ప్రకృతి ఒక గొప్ప మాత్రలా పనిచేస్తుంది. మనుషులతో, ప్రపంచంతో సంబంధం లేకుండా బిజీ, బిజీ గా గడిపేస్తున్న ఈ జీవితంలో కాస్త బయటకి వెళ్లి ప్రకృతిని ఆస్వాదించడానికి సమయం ఇవ్వలేకపోతున్నారు. ఈ ఆధునిక యుగంలో ప్రకృతికి ప్రాధాన్యత తగ్గిపోయింది. ప్రకృతిలోని  స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించడమే కష్టమైపోతుంది.

మానవుడి మనుగడకు ఎంతో సహాయపడుతున్న ప్రకృతికి ప్రాధన్యత ఇస్తూ October 3 ప్రపంచ ప్రకృతి దినోత్సవం (World Nature Day)గా జరుపుకుంటాము. ప్రజల్లో ప్రకృతి పై మరింత అవగాహాన పెంచుతూ ఈ రోజును జరుపుకుంటారు. రోజు కాస్త సమయం ప్రకృతిలో ఉండటం వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యానికి ఎంతో మేలు..

ప్రకృతి(Nature) వల్ల కలిగే లాభాలు.

ఊపిరితిత్తులకు శ్రేయస్సు :

ప్రకృతిలోకి వెళ్లి స్వచ్ఛమైన గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. దాని వల్ల శ్వాసక్రియ మెరుగుపడుతుంది.

ప్రశాంతమైన నిద్ర:

అలా కాసేపు బయటకు వెళ్లి ప్రకృతి అందాలను ఆస్వాదించి, ఆ స్వచ్ఛమైన గాలిలో ఉండటం వల్ల మనసు హాయిగా ఉంది ప్రశాంతమైన నిద్రకు సహాయపడుతుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది:

రోజు ప్రకృతిలో కాసేపు నడవటం వల్ల మానసిక ఒత్తిడిని(Stress)  తగ్గిస్తుంది. అలాగే మెదడును మెరుగుపరిచి ఒత్తిడికి గురి చేసే సమస్యల నుంచి పోరాడే శక్తి ఇస్తుంది.

హ్యాపీ హార్మోన్స్ ను (Harmones) విడుదల చేస్తుంది:

ప్రకృతిలో తిరగటం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి. బ్రెయిన్ ను ఉత్తేజపరిచి శరీరంలో సంతోషకరమైన హార్మోన్చేన్లు విడుదల అయ్యేలా చేస్తుంది.

ఆందోళనను(Anxiety) తగ్గిస్తుంది:

ప్రకృతిలో తిరిగాక శరీరంలో విడుదలయ్యే రసాయనాలు ఆందోళనను తగ్గించి మానసికంగా దృడంగా ఉండేలా చేస్తుంది.. ఒత్తిడి నుంచి పోరాడే మానసిక శక్తిని ఇస్తుంది.

రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది:

ఎప్పుడు ఇంట్లోనే ఒకే చోట ఉండటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోయి బయట నుంచి వచ్చే క్రిములు, హానికర జీవుల నుంచి తట్టుకునే శక్తిని కోల్పోతుంది.

మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి ప్రకృతిలోని స్వచ్ఛమైన గాలి, వాతావరం ఎంతో మేలు చేస్తాయి. రోజు ఒక అరగంట సేపు ప్రకృతిలో నడవటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.

Also Read: ఈ యోగాసనాలు రోజూ చేయండి.. గుండెను పదిలంగా ఉంచుకోండి..

Advertisment
Advertisment
తాజా కథనాలు