World Food Safety Day: నేడు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ప్రతీ సంవత్సరం జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. దేశంలోని ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన, సురక్షితమైన, పౌష్టికాహారాన్ని పొందేలా చేయడం, ఆహార భద్రత పై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం.

World Food Safety Day: నేడు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం
New Update

World Food Safety Day: ప్రపంచ ఆహార భద్రత ప్రతి సంవత్సరం జూన్ 7న జరుపుకుంటారు. ఆహార భద్రత ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ఈరోజు ముఖ్య ఉద్దేశ్యం. ఆహారంలోని కల్తీని, దాని ద్వారా వచ్చే ప్రమాదాలను నిరోధించడమే ముఖ్య ఉద్దేశంగా ఆహార భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన, సురక్షితమైన, పౌష్టికాహారాన్ని పొందేలా అవగాహన కల్పించడానికి ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్నిజరుపుకుంటారు.

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం చరిత్ర ఏమిటి?

ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సహకారంతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 18న ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా 7 జూన్ 2019న జరుపుకున్నారు. ఆరోగ్యం, ఆకలి, వ్యవసాయానికి సంబంధించిన లక్ష్యాలను సాధించడంతో పాటు ఆహార భద్రత అవసరాల పై దృష్టిని ఆకర్షించడమే ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ఉద్దేశ్యం

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ఎందుకు ముఖ్యమైనది

ఆహార భద్రత అనేది సామాన్య ప్రజలందరి ప్రాథమిక హక్కు. మురికి సురక్షితం కాని ఆహారంలో హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు, పరాన్నజీవులు, రసాయనాలు ఉంటాయి. ఇవి దాదాపు 200 వ్యాధులకు దారితీస్తాయి. ఇందులో డయేరియా నుంచి క్యాన్సర్ వరకు అన్నీ ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, కలుషితమైన ఆహారాన్ని తినడం వల్ల ప్రతి సంవత్సరం 6 మిలియన్ల మంది ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. అదే సమయంలో, కలుషిత ఆహారం కారణంగా దాదాపు నాలుగు లక్షల ఇరవై వేల మంది మరణాలు సంభవించాయి. ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యం చాలా మంది జనాభాను ప్రభావితం చేస్తుంది. ఇందులో చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు, ఆరోగ్యం సరిగా లేని వారు ఉన్నారు. అందుకే ప్రజలకు ఆహార భద్రత అవగాహన కల్పించడానికి ప్రతీ సంవత్సరం ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం లక్ష్యాలు

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ప్రధాన లక్ష్యం ప్రజలలో అవగాహన కల్పించడం. తద్వారా ప్రజలు తాము తినే ఆహారం పరిశుభ్రంగా , సురక్షితంగా ఉందా, తినదగినదా కాదా? అని తెలుసుకుంటారు. దీనితో పాటు, ఈ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే.. ప్రభుత్వం, వ్యాపారాలు, వినియోగదారులను పరిశుభ్రమైన ఆహారాన్ని ప్రజలకు అందించేలా ప్రేరేపించడం. అలాగే, పొలంలో, తయారీ సమయంలో ఆహారం శుభ్రంగా ఉండాలని తెలియజేయడం.

Also Read: Mango: ఈ 5 ఆహారాలను మామిడి పండ్లతో కలిపి అస్సలు తినకండి - Rtvlive.com

#world-food-safety-day
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe