/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/wfd-jpg.webp)
World Food Day 2023: సోమవారం (16-10-2023) ప్రపంచ ఆహార దినోత్సవం (World Food Day) ..దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే..ప్రపంచంలో ఉన్న ఆకలిని తీర్చడమే..ప్రస్తుతం రోజుల్లో హంగులు ఆర్భాటల పేరుతో చాలా ఎక్కువ ఆహారాన్ని వృథా చేస్తున్నారు. ఒక్క రోజు వృథా అయ్యే ఆహారంతో ప్రపంచంలో ఎంతో మంది ఆకలి తీర్చవచ్చని కొన్ని సర్వేలు తెలుపుతున్నాయి.
అందుకే ప్రపంచ ఆహార దినోత్సవం ...ముఖ్య ఉద్దేశం ఆహారాన్ని పొదుపు చేయడం, ఆహార వ్యర్థాలను తగ్గించడం, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల అభివృద్ధిని ప్రోత్సహించడం అనేవి ముఖ్య లక్ష్యాలు. ఈ ఏడాది ప్రపంచ ఆహారపు దినోత్సం ఒక ముఖ్యమైన థీమ్ తో ప్రజల ముందుకు వచ్చింది. అది ఏంటంటే...'' నీరే జీవితం..నీరే ఆహారం..అందరికీ అది దక్కాల్సిందే'' ("Water is Life, Water is Food. Leave No One Behind") అనేది ముఖ్య ఉద్దేశం.
Also Read: విశాఖలో జగన్ ప్రారంభించే ఇన్ఫోసిస్ లో ఎంతమంది ఉద్యోగులు అంటే!
ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ) 1945 సంవత్సరంలో ఏర్పాటైంది. అయితే 1979 నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటున్నాం. పేదరికం కారణంగా ఏటా 2 కోట్ల మంది పిల్లలు బరువు తక్కువతో జన్మిస్తున్నారు.
ఆకలి సమస్యను ఎదుర్కొంటున్నవారిలో సుమారు 60 శాతం మంది మహిళలే ఉంటున్నారు. అందువల్లే పిల్లలు కూడా తక్కువ బరువుతో పుడుతున్నారు. ఇందులో ఆందోళన చెందాల్సిన విషయం అసలు ఏంటంటే...అందులో 96 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఎక్కువ మంది జన్మిస్తున్నారు.
ప్రపంచంలో ప్రమాదకర వ్యాధుల కంటే..ఆకలి చావుతో చనిపోయేవారే ఎక్కువ మంది ఉంటున్నారు. ప్రతిరోజు సుమారు 25 వేల మంది ఆకలి కారణంతో ప్రపంచ వ్యాప్తంగా మరణిస్తున్నారు. ఓ వైపు ఆఫ్రికా లో కొన్ని పేద దేశాలలో ఆకలి చావులు బాగా పెరుగుతున్నాయి. 2050 నాటికి ఈ సంఖ్య 960 కోట్లకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇతర దేశాలతో పోలిస్తే పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య భారత్ లోనే ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు ఎవరు కూడా ఆహారాన్ని వృథా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అంతేకాకుండా ఆహారానికి సంబంధించిన, ముఖ్యమైన, ప్రధానమైన వ్యవసాయాన్ని కూడా కాపాడుకోవాల్సిన ప్రతి ఒక్కరి మీద ఉందని అందరూ తెలుసుకోవాలి.
రానున్న తరాల వారికి ఆకలి చావులు లేని దేశాలను బహుమతులుగా ఇవ్వాలని ఆశిద్దాం.
Also Read: బిగ్ సి దసరా ధమాకా ఆఫర్లు!