World Cup 2023 : వరల్డ్ కప్ క్రేజ్, ఫ్యాన్స్ కోసం పిజ్జా ధరలను భారీగా తగ్గించిన డోమినోస్..!!

వరల్ట్ కప్ అంటే మామూలుగా ఉండదు. ఫ్యాన్స్ కోలాహలం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వేడి వేడి స్నాక్స్ తింటూ క్రికెట్ చూస్తుంటే ఆ మజానే వేరుంటుంది. అందుకే ప్రముఖ పిజ్జా బ్రాండ్ అయిన డొమినోస్ కూడా పిజ్జా ధరలను భారీగా తగ్గించింది. గతవారం ఈ విషయాన్ని తన కస్టమర్లకు మెసేజ్ లద్వారా తెలిపింది. తక్కువ డబ్బులు చెల్లించి..ఎక్కువ పిజ్జాను తినమని చెబుతోంది. డొమినోస్ పిజ్జా ధరలకు ఎంతవరకు తగ్గించిందో చూద్దాం.

New Update
World Cup 2023 : వరల్డ్ కప్ క్రేజ్, ఫ్యాన్స్ కోసం పిజ్జా ధరలను భారీగా తగ్గించిన డోమినోస్..!!

క్రికెట్ ప్రపంచకప్ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో డొమినోస్ తన పిజ్జా ధరలను సగానికి సగం తగ్గించింది. దాదాపు 50 శాతం వరకు తగ్గించింది. అమెరికాకు చెందిన ఈ కంపెనీకి వరల్డ్ వైడ్ గా స్టోర్లు ఉన్నాయి. అంతేకాదు చాలామంది పిజ్జా ప్రియులు ఈ బ్రాండ్ పిజ్జాను ఇష్టపడుతుంటారు. అయితే ఇఫ్పుడు ఎక్కడపడితే అక్కడ పిజ్జా సెంటర్లు వెలుస్తున్నాయి. తక్కువ ధరలకే చిన్న పిజ్జాలు ఆఫర్ చేస్తున్నాయి. దీంతో డొమినోస్ కు గిరాకీ బాగానే తగ్గింది. దీంతో వీటికి గట్టి పోటినిస్తూ తన బిజినెస్ కాపాడుకునేందుకు పెద్దపిజ్జాలపై 50శాతం వరకు ధరలను తగ్గించింది కంపెనీ.

క్రికెట్ వరల్డ్ కప్ షురూ అయిన సందర్భంగా తన లాభాలను పెంచుకునేందుకు పిజ్జా ప్రియులు కేవలం రూ.499కే డొమినోస్ లార్జ్ వెజిటేరియన్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ పిజ్జా ధర రూ.799గా ఉంది. అయితే నాన్ వెజ్ ఇష్టపడని వారికి వెజ్ పై రూ. 549 ఆకర్షణీయమైన ధరతో లార్జ్ పిజ్జాను ఆర్డర్ చేసుకునే ఆఫర్ కూడా ఇచ్చింది. ఇప్పటి వరకు ఈ పిజ్జా ధర రూ.919గా ఉండేది. ఈ ఆఫర్ వల్ల డిమాండ్ పెరుగుతుందని కంపెనీ అభిప్రాయపడింది. ఈ ఆఫర్ ప్రారంభించిన తర్వాత డెలివరీ ఆర్డర్‌లలో పెరుగుదల కనిపించిందని డొమినోస్ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే 5 చిరుధాన్యాలు ఇవే..?

డొమినోస్ లార్జ్ పిజ్జాలపై ధరల తగ్గింపుతో సాధారణ ప్రేక్షకుల కోసం రోజువారీ విలువ ఆఫర్‌లను ప్రవేశపెట్టింది. Howzat50 ఆఫర్ కింద, వినియోగదారులకు పిజ్జాపై 50% తగ్గింపు ఇవ్వబడుతుంది. డొమినోస్ పిజ్జా ధర తగ్గింపు ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) రంగంలో మారుతున్న ట్రెండ్‌ను ప్రతిబింబిస్తుంది. ఇటీవలి కాలంలో, చాలా మంది చిన్నసంస్థలు FMCG రంగంలో పెద్ద బ్రాండ్‌లకు పోటీని ఇచ్చాయి. సేల్స్ లో డొమినోస్ ను మించిపోయాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, డొమినోస్ ఈ ఆఫర్లను ప్రకటించింది.

డొమినోస్ ఇండియా ఇటీవలే 23 కొత్త అవుట్‌లెట్లను ప్రారంభించింది. ఇది కొత్త నగరంలోకి ప్రవేశించడం ద్వారా తన పరిధిని మరింత విస్తరించింది. డొమినోస్‌ అవుట్‌లెట్‌ల సంఖ్య 1,838కి చేరుకుంది. ఇప్పుడు కంపెనీ 394 నగరాల్లో తన సేవలను అందిస్తోంది. అదనంగా, కంపెనీ నాలుగు కొత్త రెస్టారెంట్లను తెరిచింది. మణిపాల్, కోయంబత్తూర్ అనే రెండు కొత్త నగరాల్లో అరంగేట్రం చేసింది. ఫలితంగా నాలుగు నగరాల్లో మొత్తం 17 రెస్టారెంట్లు ప్రారంభమయ్యాయి.

ఇది కూడా చదవండి: ఆ దేశం వెన్నులో వణుకు…100 దాటిన మరణాలు…!!

Advertisment
తాజా కథనాలు