పుచ్చకాయతో నిగనిగలాడే అందం మీ సొంతం!

పుచ్చకాయలో విటమిన్‌ A, B కాంప్లెక్స్‌, C, పొటాషియం మీ చర్మానికి పోషణ అందిస్తాయి. సన్‌బర్న్‌‌ వంటి సమస్యలను దూరం చేస్తాయి. మీ సౌందర్య సంరక్షణలో పుచ్చకాయను ఎలా యాడ్‌ చేసుకోవాలో ఈస్టోరీలో చూద్దాం.

New Update
పుచ్చకాయతో నిగనిగలాడే అందం మీ సొంతం!

వేసవిలో మీరు పుచ్చకాయను తినవచ్చు. లేదంటే.. మీ చర్మం పై ఫేస్ మాస్క్‌(Face Mask)గా ఉపయోగించవచ్చు. చర్మాన్ని మెరిసేలా చేయడానికి, మొటిమలు తగ్గించేందుకు పుచ్చకాయను ప్రయత్నించండి. పుచ్చకాయ(Watermelon)లో నీరు సమృద్ధిగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు, మల్టీవిటమిన్లు, మినరల్స్ వంటి వివిధ పోషకాలను కలిగి ఉంటుంది. ఇది మీ ఆరోగ్యానికి(Health) అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. పుచ్చకాయలో లైకోపీన్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి చర్మాన్ని డ్యామేజ్ కాకుండా కాపాడతాయి.

పుచ్చకాయలో పెరుగు(Curd), తేనె కలిపి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్‌ను మీ ముఖానికి పట్టించి, 10-15 నిమిషాల తర్వాత మీ ముఖాన్ని(Face) కడగాలి. తేనె(Honey), పుచ్చకాయలోని యాంటీఆక్సిడెంట్లు మంటను తగ్గిస్తాయి. పెరుగు చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది.

పుచ్చకాయ, టమోటా గుజ్జు మిశ్రమాన్ని జిడ్డు చర్మం(Oil Skin) ఉన్నవారు ఉపయోగించవచ్చు. ఇది చర్మాన్ని మృదువుగా(Smooth Skin) మార్చడంలో సహాయపడుతుంది. పుచ్చకాయలోని మాలిక్ యాసిడ్ మరియు టొమాటోలోని లైకోపీన్ సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌లుగా పనిచేసి చర్మానికి ఉపశమనం కలిగిస్తాయి.

పుచ్చకాయ రసం(Watermelon Juice), గుజ్జు అరటిపండు మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను పోగొట్టి చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి. రిఫ్రిజిరేటర్‌లో పుచ్చకాయ పలుచని ముక్కలను పెట్టి.. తర్వాత తీసి ముఖం మీద 15 నుండి 20 నిమిషాలు అప్లై చేయోచ్చు.

Advertisment
తాజా కథనాలు