Wipro : విప్రో కొత్త సీఈవో గా శ్రీనివాస్‌ పల్లియా!

దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ విప్రోలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంతకాలం ఆ సంస్థకు సీఈవో గా పని చేస్తున్న థెర్రీ డెలాపోర్టే శనివారం రాజీనామా చేశారు.డెలాపోర్టే స్థానంలో శ్రీనివాస్ పల్లియాను విప్రో కొత్త సీఈవో గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.

Wipro : విప్రో కొత్త సీఈవో గా శ్రీనివాస్‌ పల్లియా!
New Update

Wipro CEO : దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ విప్రోలో(Wipro) ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంతకాలం ఆ సంస్థకు సీఈవో(CEO) గా పని చేస్తున్న థెర్రీ డెలాపోర్టే(Delaporte) శనివారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను సంస్థ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో పేర్కొంది. డెలాపోర్టే స్థానంలో శ్రీనివాస్ పల్లియా(Srinivas Pallia) ను విప్రో కొత్త సీఈవో గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.

ఏప్రిల్ ఆరో తేదీ నుంచి సీఈఓగా థెర్రీ డెలాపోర్టే రాజీనామాను ఆమోదిస్తున్నట్లు విప్రో డైరెక్టర్ల బోర్డు వివరించింది. మే 31 నుంచి డెలాపోర్టే రాజీనామా అమల్లోకి వస్తుందని పేర్కొంది. అజీం ప్రేమ్ జీ ఆధ్వర్యంలోని విప్రో సీఈవో కం మేనేజింగ్ డైరెక్టర్‌గా థెర్రీ డెల్లాపోర్టె 2020 జూలై నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారత ఐటీ రంగంలో అత్యధిక వేతనం అందుకున్న సీఈవోగా ఆయన ఉన్నారు. టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ తర్వాత స్థానంలో విప్రో నిలుస్తుంది. డెలాపోర్టే వేతనం రూ.82 కోట్లకు పైగా వేతనం అందుకున్నారని విప్రో పేర్కొంది.

Also read : సాయి ధరమ్‌ తేజ్‌.. నిహారిక .. కార్డు షేర్‌ చేసిన మెగా డాటర్‌!

#delaporte #srinivas-pallia #wipro-ceo
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe