Winter Beauty Tips: చలికాలంలో వేడి నీటితో ముఖం కడుగుతున్నారా? ఇది తప్పక తెలుసుకోండి..!

చలికాలంలో చన్నీళ్లతో ముఖం కడగాలంటే జనాలు హడలిపోతారు. అందుకే.. వేడి నీటితో కడుక్కుంటారు. వేడి నీటితోనే స్నానం చేస్తుంటారు. అయితే, గోరు వెచ్చని నీటితో కడిగితే మీ ముఖ చర్మానికి ఇబ్బంది ఉండదు. ముఖంపై ఉన్న దుమ్ము, దూళి కూడా తొలగిపోతుంది.

New Update
Winter Beauty Tips: చలికాలంలో వేడి నీటితో ముఖం కడుగుతున్నారా? ఇది తప్పక తెలుసుకోండి..!

Winter Beauty Tips: చలికాలంలో చర్మం చాలా పొడిగా, గరుకుగా మారుతుంది. చల్లని, తక్కువ తేమ చర్మంపై ప్రభావం చూపుతుంది. అందుకే.. చలికాలంలో ముఖంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. తద్వారా చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది. చలికాలంలో చాలా మంది ముఖాన్ని వేడి నీళ్లతో కడగడానికి ఇష్టపడతారు. అయితే, చలికాలంలో గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కుంటే ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా.. వేడి వేడి నీటితో ముఖం కడిగితే ముఖ చర్మం దెబ్బతింటుంది. సరైన ఉష్ణోగ్రత ఉన్న నీటిని ఉపయోగిస్తే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. మరి చలికాలంలో వేడి నీటితో ముఖం కడుక్కోవడం ప్రయోజనకరమా లేక హానికరమా? నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి తెలుసుకుందాం..

ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి..

ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలా కీలకం. ఎందుకంటే.. ముఖంపై ఉన్న దుమ్ము, దూళి తొలగిపోతుంది. ముఖ్యంగా గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే.. చర్మంపై మూసుకుపోయిన రంధ్రాలు తెరుచుకుంటాయి. ఇలా తెరుచుకున్న రంధ్రాల ద్వారా చర్మంపై పేరుకుపోయిన మురికి, జిడ్డు, మృతకణాలు బయటకు వెళ్లిపోయి ముఖం శుభ్రంగా మారుతుంది. అందుకే వేడి నీళ్లతో ఫేషియల్ క్లెన్సింగ్ మరింత మెరుగ్గా జరుగుతుంది. అయితే ఆ నీరు మరీ వేడిగా ఉండకూడదనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. విపరీతమైన వేడి నీరు చర్మాని హానీ చేస్తుంది. ముఖం మీద నొప్పి, ఎర్రటి చారలను కలిగిస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి.

ముఖం గ్లో పెరుగుతుంది..

గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే.. ముఖానికి రక్త ప్రసరణ పెంచుతుంది. దాని కారణంగా ముఖం మెరుస్తుంది. నిజానికి గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని కడుక్కుంటే ఆ నీటి తేలికపాటి వేడికి ముఖంలోని రక్తనాళాలు యాక్టీవ్ అవుతాయి. ఇది ముఖం ఛాయను మెరుగుపరుస్తుంది. ముఖానికి ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన, తాజా మెరుపును తెస్తుంది. ఈ విధంగా.. చలికాలంలో గోరువెచ్చని నీరు ముఖానికి మేలు చేస్తుంది.

ముఖం వాపు తగ్గుతుంది..

చలికాలంలో ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇది ముఖం వాపు, నొప్పిని కూడా తగ్గిస్తుంది.

ప్రతికూల ప్రభావాలు..

⇒ అధిక వేడి నీటితో ముఖం కడిగితే.. ముఖ చర్మం కాలిపోతుంది. ఇది ఎరుపు, వాపు, ముడుతలకు కారణం అవుతుంది.
⇒ వేడి నీరు చర్మంపై తేమను తొలగిస్తుంది. పొడి చర్మాన్ని కలిగిస్తుంది. చికాకును కలిగిస్తుంది.
⇒ వేడి నీటితో ముఖం కడగడం వల్ల చర్మంలోని సహజసిద్ధమైన నూనె, తేమ పోతుంది.
⇒ సున్నితమైన చర్మం కలిగిన వ్యక్తులు వేడి నీటి కారణంగా అలెర్జీలు, ఎర్రటి మచ్చలు, దురదతో బాధపడే అవకాశం ఉంది.

Also read:

ఆరు గ్యారెంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ రెడీ..!

పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..

Advertisment
Advertisment
తాజా కథనాలు