Kalpana Soren: జార్ఖండ్ సీఎంగా కల్పనా సోరెన్?.. హేమంత్ సోరెన్ అరెస్టు ఖాయం! జార్ఖండ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మనీ లాండరింగ్, భూ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో బుధవారం సీఎం హేమంత్ సోరెన్ ఈడీ ఎదుట హాజరు కానున్నారు. ఆయన అరెస్టు తప్పదని, ఆ స్థానంలో సీఎంగా ఆయన సతీమణి కల్పనా సోరెన్ ను నియమిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. By Naren Kumar 31 Jan 2024 in నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి Kalpana Soren: జార్ఖండ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మనీ లాండరింగ్, భూమి కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో సీఎం హేమంత్ సోరెన్‌ను ప్రశ్నించేందుకు ఈడీ ప్రయత్నం, వారికి దొరకకుండా ఆయన తప్పించుకుంటుండడం.. రాష్ట్ర ప్రజల్లో గందరగోళం నింపుతున్నాయి. దాదాపు 30 గంటలపాటు సీఎం హేమంత్ సోరెన్ కనిపించకుండా పోవడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. దాదాపు 1300 కి.మీ. ఆయన రోడ్డు మార్గాన ప్రయాణించినట్టు సమాచారం. ఆదివారం ఢిల్లీలో ప్రత్యక్షమైన హేమంత్ సోరెన్ ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు ఆయన నివాసానికి వెళ్లగా అందుబాటులోకి రాలేదు. అయితే, ప్రభుత్వ సంకీర్ణ పక్షాల సమావేశంలో ఆయన మళ్లీ కనిపించారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం ఆయన ఈడీ ఎదుట విచారణకు హాజరవుతారు. ఇది కూడా చదవండి: మాజీ సీఎస్‌కు బిగుస్తున్న ఉచ్చు!.. అంతా ప్లాన్ ప్రకారమే జరిగిందా! అరెస్టు తప్పదా? బుధవారం మధ్యాహ్నం ఈడీ ఎదుట విచారణకు హాజరవుతారు సీఎం హేమంత్ సోరెన్. అధికారులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేస్తారు. అయితే, అప్పుడే ఆయనను ఈడీ అరెస్టు చేస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కూటమి పక్షాలతో సమావేశం, తదితర పరిణామాలు దీనిపై మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. సీఎంగా సతీమణి కల్పనా సోరెన్? సీఎం హేమంత్ సోరెన్ అరెస్టు తప్పదన్న ప్రచారం నేపథ్యంలో, అదే జరిగితే ఆయన భార్య కల్పనా సోరెన్‌ను ముఖ్యమంత్రి చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసమే సోరెన్ సొంత పార్టీ జేఎంఎం, కాంగ్రెస్, మిత్రపక్ష ఎమ్మెల్యేలను రాంచీకి పిలిపించినట్టు సమాచారం. కల్పనా సోరెన్‌ను సీఎంగా ప్రతిపపాదించి అన్ని పార్టీలను ఒప్పించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు హేమంత్ సోరెన్ బుధవారం గవర్నర్ అప్పాయింట్‌మెంట్ కూడా కోరారు. అప్పుడే రాజీనామా సమర్పించే అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉండగా, రాంచీలో 144 సెక్షన్ విధించారు. బుధవారం రాత్రి వరకూ అది అమలులో ఉంటుంది. ఆ రాష్ట్రంలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీలతో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తున్న విషయం తెలిసిందే. జార్ఖండ్ రాజకీయాల్లో ముందుముందు ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. #hemanth-soren మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి