Chandrababu: వాట్‌నెక్ట్స్‌..? సుప్రీం కోర్టుకు చంద్రబాబు? అక్కడే తేల్చుకునే ఛాన్స్!

చంద్రబాబు తరుఫు లాయర్లు సుప్రీంకోర్టు తలుపు తడుతారా అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. ఏపీ స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబును ఏసీబీ కోర్టు 14రోజుల రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. ఏసీబీ కోర్టులో పెండింగ్‌లో ఉన్న ప్రొసీడింగ్స్‌పై స్టే విధించాలని చంద్రబాబు తరుఫు లాయర్ల క్వాష్‌ పిటిషన్‌ వేశారు. ఈ విచారణకు ఈ నెల 19కు హైకోర్టు వాయిదా వేసింది. తర్వాతి స్టెప్‌ ఏం తీసుకోవాలన్నదానిపై టీడీపీ లీగల్ టీమ్ మంతనాలు జరుపుతోంది.

Chandrababu: వాట్‌నెక్ట్స్‌..? సుప్రీం కోర్టుకు చంద్రబాబు? అక్కడే తేల్చుకునే ఛాన్స్!
New Update

Chandrababu naidu to knock doors of supreme court? : చంద్రబాబు నెక్ట్స్‌ స్టెప్‌ ఏంటి? ఇప్పుడిదే ప్రశ్న అందరి బ్రెయిన్‌లో గిర్రున తిరుగుతుంది. క్వాష్‌(Quash) పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 19కి వాయిదా పడడంతో చంద్రబాబు మరో వారం జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్‌(AP skill development scam) కేసులో చంద్రబాబుకు ఏసీబీ(ACB) కోర్టు రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే..! ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్నారు. మరో వారం రోజులు హైకోర్టు విచారణ కోసం ఆగకుండా ఈలోపు చంద్రబాబును జైలు నుంచి బయటకు ఎలా తీసుకురావాలా అన్నదానిపై టీడీపీ ఆలోచనలు చేస్తోంది. టీడీపీ లీగల్ టీమ్ మంతనాలు జరుపుతోంది. ఇప్పటికే బాబుని కలిశారు చంద్రబాబు తరుపు వాదిస్తున్న లాయర్‌ సిద్ధార్థ్‌ లూథ్రా. మరో వారం పాటు వెయిట్ చేస్తారా లేదా ఈ లోపే సుప్రీంకోర్టు(Supreme court) తలుపు తడుతారా అనిదానిపై ఉత్కంఠ నెలకొంది.



ప్రొసీడింగ్స్‌పై స్టే విధించాలని వాదన:

ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ రాష్ట్ర సిఐడి కస్టడీ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు వచ్చే సోమవారం వరకు స్టే విధించింది . సెప్టెంబర్ 18 వరకు ఆయన్ను కస్టడీకి తీసుకోవద్దని సిఐడిని ఆదేశించింది. ఈ కేసులో తన జ్యుడిషియల్ రిమాండ్‌ను రద్దు చేయడంతో పాటు కేసును రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు సెప్టెంబర్‌ 12న హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ కె.సురేష్ రెడ్డితో కూడిన సింగిల్ బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు, విజయవాడలోని ప్రత్యేక కోర్టు చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌ కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. హౌస్ రిమాండ్ కోసం ఆయన పెట్టుకున్న దరఖాస్తు కూడా నిన్న(సెప్టెంబర్‌ 12) తిరస్కరించారు.



గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి పొందలేదు:

రాజకీయ కక్షతో తనపై తప్పుడు కేసు పెట్టారని, డిసెంబర్ 2021లో కేసు నమోదైందని చంద్రబాబు పిటిషన్‌లో పేర్కొన్నారు. 22 నెలల తర్వాత తనను అరెస్ట్ చేశారని చంద్రబాబు పిటిషన్‌లో పొందుపరిచారు. చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలను రుజువు చేయడానికి ప్రాథమిక సాక్ష్యాలను సేకరించడంలో సీఐడీ విఫలమైందని ఆయన తరుఫు లాయర్ వాదించారు. పీసీ యాక్ట్‌లోని సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి పొందడంలో సీఐడీ విఫలమైందన్న వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ట్రయల్ కోర్టు తనను రిమాండ్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అంతేకాకుండా, తన రిమాండ్‌ను రద్దు చేయాలని, హైకోర్టులో తన పిటిషన్‌పై విచారణ ముగిసే వరకు విజయవాడలోని ఏసీబీ కోర్టులో పెండింగ్‌లో ఉన్న ప్రొసీడింగ్స్‌పై స్టే విధించాలని కూడా ఆయన హైకోర్టును కోరారు.



చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్న సమయంలో జరిగిన స్కాంలో కీలక పాత్ర పోషించినట్లు ఆయనపై కేసు నమోదైంది. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కోసం ఉద్దేశించిన ప్రభుత్వ నిధులను మోసపూరిత ఇన్‌వాయిస్‌ల ద్వారా వివిధ షెల్ కంపెనీలకు మళ్లించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

ALSO READ: నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు.. లోకేష్‌కి ఫోన్ చేసిన రజనీకాంత్

#chandrababu-arrest
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe