Round Wells: గుండ్రని బావులే ఎందుకు.. దీని వెనుక స్టోరీ ఇదే..!

సహజంగా బావులు వృత్తాకారంలో కనిపిస్తాయి. అసలు బావులు ఈ ఆకారంలోనే ఎందుకు ఉంటాయి..? గుండ్రంగా తవ్వడం బావిని బలంగా ఉంచుతుంది. నీటి పీడనం అన్ని వైపుల సమానంగా ఉంటుంది. ఇలా కాకుండ బావి ఇతర ఆకారాల్లో ఉంటే అసమాన నీటి ఒత్తిడితో బావి కూలిపోయే అవకాశం ఉంటుంది.

New Update
Round Wells: గుండ్రని బావులే ఎందుకు.. దీని వెనుక స్టోరీ ఇదే..!

Round Wells: పూర్వ కాలం నుంచి చూసుకుంటే ఎక్కడ చూసిన బావులు వృత్తాకారంలోనే ఎక్కువగా కనిపిస్తాయి. స్క్వేర్, ట్రై యాంగిల్ , ఇతర ఆకారాల్లో చాలా తక్కువగా కనిపిస్తాయి. అసలు బావులు గుండ్రంగా గానే తవ్వడానికి కారణమేంటో ఎప్పుడైనా ఆలోచించారా..? ఇప్పటికీ గ్రామాల్లో, పట్టణాల్లో ఇలాంటి బావులనే చూస్తాము. ఇతర ఆకృత్తుల్లో కూడా బావులు తవ్వే అవకాశం ఉన్నప్పటికీ ముందు ప్రాధాన్యత మాత్రం వీటికే ఇస్తారు. ఇది నీటిని ఎక్కువ నిల్వ చేయడంతో పాటు ఆర్థికంగా కూడా సరైన ఎంపిక. అయితే దీని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ..

వృత్తాకార బావులు బలంగా ఉంటాయి

సాధారణంగా గుండ్రంగా తవ్విన బావులు బలమైన పునాదులను కలిగి ఉంటాయి. అలాగే ఈ బావులకు మూలలు ఉండవు అంతా ఒకే ఆకారంలో ఉంటుంది. ఇది బావిలోని నీటి పీడనాన్ని అన్ని గోడలపై సమానంగా ఉంచుతుంది. అంతే కాదు బావి మధ్యలో నుంచి అన్ని వైపులు సమాన దూరంలో ఉంటాయి. అందువల్ల నీటి ద్వారా వచ్చే ఒత్తిడి నుంచి బావి కూలిపోయే అవకాశాలను తగ్గిస్తుంది.

Also Read: Chicken Liver: చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా.. అయితే ఇది చూడండి..!

publive-image

బావి వృత్తాకారంలో కాకుండా స్క్వేర్ షేప్ లో ఉంటే వాటర్ ప్రెషర్ అన్ని మూలల పై ఉంటుంది. అన్ని వైపుల నీటి పీడనం వల్ల బావి ఎక్కువ కాలం ఉండే అవకాశాలు తక్కువ. అంతే కాదు కూలిపోయే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. వృత్తాకార బావుల్లో ఏకరీతిగా ఒత్తిడి ఉంటుంది అందుకే కూలే ఛాన్స్ తక్కువ.

ఆర్థికంగా సరైన ఎంపిక

వృత్తాకార బావులు నిర్మాణంలో బలంగా ఉండడమే కాదు ఆర్థికంగా కూడా తక్కువ ఖర్చుతో పూర్తవుతాయి. బిల్డర్స్ కూడా ఎక్కువ ఎంపిక చేసుకునే నిర్మాణం ఇది. వృత్తాకార బావులు తక్కువ మెటీరియల్, లేబర్ తో ఎక్కువ నీటిని ఉత్పత్తి చేస్తాయి. అందుకే ఎక్కడ చూసిన గుండ్రని బావులు ఎక్కువగా కనిపిస్తాయి.

Also Read: Back Acne: వీపు, బాడీ పై పింపుల్స్ వస్తున్నాయా.. అయితే ఇలా చేయండి..!

Advertisment
తాజా కథనాలు