Customer Care: బ్యాంకులో ఇబ్బంది.. కస్టమర్ కేర్ నో రెస్పాన్స్.. ఏం చేయాలి? 

జొమాటో.. వంటి సంస్థల కస్టమర్ కేర్ వ్యవస్థ పనిచేసినంత సరిగా మన బ్యాంకుల కస్టమర్ కేర్ లేదా సర్వీస్ లు పనిచేయవు. అసలు బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్ కలవడమే ఎదో అదృష్టం అనిపిస్తుంది. ఇలా బ్యాంకులతో ఇబ్బందులు పడుతుంటే ఏం చేయాలో ఈ పోస్ట్ హెడింగ్పై క్లిక్ చేసి తెలుసుకోండి. 

New Update
Customer Care: బ్యాంకులో ఇబ్బంది.. కస్టమర్ కేర్ నో రెస్పాన్స్.. ఏం చేయాలి? 

Customer Care: ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఫుడ్ వచ్చింది. కానీ, తాను అడిగిన మెనూ కాకుండా వేరే ఫుడ్ ఉంది. దీంతో కస్టమర్ కేర్(Customer Care)కి కాల్ చేశాడు. విషయం చెప్పాడు. వాళ్ళు అంతా విన్న తరువాత కొద్ది సమయం కావాలని అడిగారు. సరిగ్గా ఐదు నిమిషాల తరువాత జొమాటో డెలివరీ నుంచి కాల్ వచ్చింది. ఫుడ్ విషయంలో పొరపాటు జరిగింది. మీరు మీదగ్గర ఉన్న ఫుడ్ ప్యాక్ చేసి ఉంచండి.. నేను మీరు ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ తీసుకుని పది నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పాడు. సరిగ్గా పదకొండో నిమిషంలో ఫుడ్ పట్టుకుని వచ్చిన జొమాటో డెలివరీ బాయ్.. మరోసారి జరిగిన పొరపాటుకు సారీ చెప్పి.. ఫుడ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అంతేకాకుండా, పొరపాటు జరిగినందుకు తమ యాప్ నుంచి గిఫ్ట్ ఓచర్ వస్తుంది అని చెప్పాడు. తరచూ ఇలా పొరపాట్లు జరుగుతాయి. అన్ని సార్లు కాకపోయినా దాదాపుగా 90 శాతం పొరపాట్లను సరిదిద్దుకుంటాయి ఇలాంటి సంస్థలు. 

మరో స్టోరీ.. 

మరోవైపు ఒక చిన్న ఉద్యోగి తన బ్యాంక్ ఎకౌంట్ లో పది వేలు డిపాజిట్ చేశాడు. అయితే, ఎదో పేమెంట్ చేద్దామని చూస్తే బ్యాంక్ ఎకౌంట్ లో తన డబ్బు తక్కువ ఉన్న విషయం తెలిసింది. ఏమి జరిగిందో అని యాప్ మొత్తం చెక్ చేశాడు. ఎకౌంట్ స్టేట్మెంట్ లో ఏమీ అర్ధం కాలేదు. హెల్ప్ చాట్ లో విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ, ఏమీ అర్ధం కాలేదు. దీంతో కస్టమర్ సెంటర్(Customer Care) నెంబర్ కి కాల్ చేశాడు. రింగ్ అయింది. ఒకటి రెండు మూడు.. వరుసగా ఓ పది సార్లు ఈ నెంబర్ నొక్కండి.. ఆ నెంబర్ నొక్కండి అంటూ పోయింది.. మొత్తానికి ఓ ఐదు నిమిషాలు గడిచాయి.. కానీ కాల్ కట్ అయింది. కానీ.. తన ప్రోబ్లం సాల్వ్ కాలేదు. 

రెండిటికీ తేడా.. 

రెండూ వేరువేరు కథలు. ఇవి ఎందుకు ఇప్పుడు అనుకుంటున్నారు కదూ.. మీరు రెండింటిలోనూ ఉన్న కామం పాయింట్స్ రెండిటిని పెట్టుకున్నారా? ఒకటి కస్టమర్ కి ఇబ్బంది వచ్చింది. రెండు కస్టమర్ కేర్(Customer Care) కి కాల్ చేశారు. అయితే.. రిజల్ట్ మాత్రం జొమాటోలో వచ్చినట్టు బ్యాంకులో రాలేదు. ఇలాంటి అనుభవం మీకు కూడా ఎదురయ్యే ఉంటుంది. అవునా? కాదా? మరి ఎందుకిలా జరుగుతోంది? మీరు కారు సర్వీస్ కి ఇచ్చారు.. సర్వీస్ పూర్తి అయిన తరువాత కారు అక్కడ అన్నీ చెక్ చేసుకుని డెలివరీ తీసుకుని వచ్చారు. ఇలా ఇంటికి చేరారో లేదో.. మీ కారు సర్వీసింగ్ స్టేషన్ నుంచి ఒక కాల్. సార్.. కారు సర్వీస్ చేయించారు కదా.. ఇప్పుడు మీ కారు ఎలా ఉంది? ఏదైనా ఇబ్బంది ఉందా అని ఫీడ్ బ్యాక్ అడుగుతారు. తరువాత మీ కారు సర్వీస్ కోసం రేటింగ్ ఇవ్వండి అని కోరతారు. కానీ, బ్యాంకులో ఏదైనా డిపాజిట్ చేసినా.. బంగారం లాంటివి తాకట్టు పెట్టినా.. లోన్ తీసుకున్నా.. లోన్ తీర్చేసినా.. ఎపుడైనా ఏదైనా ఒక ఫీడ్ బ్యాక్ కాల్ అందుకున్నట్టు మీకు గుర్తుందా? 

బ్యాంకులు.. కస్టమర్ సర్వీస్.. 

అన్ని సర్వీస్ లలోనూ కస్టమర్ సర్వీస్(Customer Care) ఉంటుంది. మరి బ్యాంకుల్లో ఎందుకు ఉండదు? అవును బ్యాంకుల్లో ఇలాంటి వ్యవస్థ లేదు. ఎక్కడైనా కస్టమర్ కేర్ నెంబర్ ఉన్నా అది సరిగా పనిచేయదు. ఈ విషయంపై ఆర్బీఐ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. కస్టమర్ల ఇబ్బందుల గురించి కంటే.. కస్టమర్లను చేర్చుకోవడానికి బ్యాంకులు ఎక్కువగా చూస్తుంటాయని నిపుణులు అంటున్నారు. దురదృష్టవశాత్తూ బ్యాంకులు ఎప్పుడూ కూడా కస్టమర్ సర్వీసుల విషయంలో సరైన స్పందన కనబరచడంలో విఫలం అవుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కూడా ఈ వ్యవస్థను సంస్కరించాలన్నారు. అయితే బ్యాంకు ఉద్యోగుల్లో సంకల్ప శక్తి కొరవడుతోంది. ఎకున్త హోల్డర్స్ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం బ్యాంకుల బాధ్యత. దీనికి బ్యాంకులే బాధ్యత వహించాలి. ఈ వ్యవస్థ బాధితులు వినియోగదారులే. కాబట్టి, సమీక్ష పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థ నాణ్యతను మెరుగుపరచడానికి థర్డ్ పార్టీ ఆడిటింగ్ చేయాలని ఆయన చెప్పారు.

ఏమి చేయాలి? 

ఇక ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మీరు ఏమి చేయాలో తెలుసుకుందాం. మీరు కనుక బ్యాంక్ ఎకౌంట్ కి సంబంధించి ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటే.. కస్టమర్ కేర్ సర్వీస్ తో సంతృప్తి చెందకపోతే, ఎన్నిసార్లు కాల్ (Customer Care)చేసినా మీ సమస్య పరిష్కారం కాకపోతే.. మీరు కస్టమర్ కేర్ కి కాల్ చేసినా సరైన స్పందన లేకపోతే మీరు బ్యాంకుకు వెళ్లి కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్స్ నిర్వహణ కోసం ప్రతి బ్యాంకులోనూ నోడల్ ఆఫీసర్ ఉంటారు. మీ కంప్లైంట్ ఆ బ్యాంక్ నోడల్ ఆఫీసర్ కు అందచేయాలి. నెల లోపు మీ సమస్య పరిష్కారం కాకపోతే, మీరు ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. దీనిని ఆన్ లైన్ లో కూడా చేయవచ్చు. దీని పోర్టల్ చిరునామా cms.rbi.org.in 

Also Read: ఫిబ్రవరి ఒకటినే బడ్జెట్ ఎందుకు ప్రవేశపెడతారు? మీకు తెలుసా?

ఇప్పుడు అంతా సోషల్ మీడియా హంగామా కదా. మీరు మీ ఇబ్బందిని సోషల్ మీడియాలో సదరు బ్యాంక్ ను ట్యాగ్  చేస్తూ పబ్లిక్ చేయండి. బ్యాంకులు కస్టమర్లే దేవుళ్ళు అంటాయి కదా.. సోషల్ మీడియాలో తమ పరువు కస్టమర్ దేవుళ్ళ దగ్గర పోకుండా ఉండాలని వెంటనే వారే మిమ్మల్ని సంప్రదించి మీ సమస్య పరిష్కరిస్తారు. 

మొత్తమ్మీద జొమాటో లాంటి బిజినెస్ వ్యవస్థల్లో ఉన్నట్టే బ్యాంకులకు కూడా కస్టమర్ కేర్.. కస్టమర్ సర్వీస్ ఉండి.. అది మంచిగా పనిచేస్తే.. చాలామందికి ఇబ్బందులు ఉండవు. కదా.. ఏమంటారు? 

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు