National Voters Day 2024: జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జనవరి 25నే ఎందుకు జరుపుకుంటారు?

భారత్‌ 1947లో స్వాతంత్రం పొందింది. మూడేళ్ల తర్వాత, అంటే 1950 జనవరి 26న దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దేశంలో ఎన్నికల సంఘాన్ని జనవరి 25, 1950లో స్థాపించారు. దీంతో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవడానికి జనవరి 25ని ఎంచుకున్నారు.

New Update
National Voters Day 2024: జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జనవరి 25నే ఎందుకు జరుపుకుంటారు?

Why Jan 25 is Celebrated as National Voters Day: ప్రతి సంవత్సరం జనవరి 25న దేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. జాతీయ ఓటర్ల దినోత్సవం ఉద్దేశ్యం దేశంలోని పౌరులకు ఓటు పట్ల అవగాహన కల్పించడం, వారు ఓటు హక్కును వినియోగించుకునేలా చేయడం. జాతీయ ఓటర్ల దినోత్సవం దేశంలోని పౌరులను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహిస్తుంది. ఇప్పటికీ ఓటరు గుర్తింపు లేని వ్యక్తులకు కూడా జాతీయ ఓటరు దినోత్సవం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం కావడంతో భారత ఎన్నికల సంఘం జాతీయ వేదికపై అనేక రకాల కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఓటు హక్కు గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది.

ఇది ఎప్పుడు ప్రారంభమైంది:
దేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవడం అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 2011లో ప్రారంభించారు. దేశంలో తొలిసారిగా 2011లో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఇందుకోసం జనవరి25 తేదీని ఎంచుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం అంటే 2024లో భారత్‌ తన 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటోంది.

జనవరి 25న ఎందుకు జరుపుకుంటారు?

బ్రిటీష్ పాలనలో 200 సంవత్సరాల బానిసత్వం తర్వాత భారత్‌ 1947లో స్వాతంత్రం పొందింది. మూడేళ్ల తర్వాత, అంటే 1950 జనవరి 26న దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దేశంలో ఎన్నికల సంఘాన్ని జనవరి 25, 1950న స్థాపించారు. దీంతో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవడానికి జనవరి 25ని ఎంచుకున్నారు. ఏ దేశమైనా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఓటర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ప్రజాస్వామ్య పునాదులను పటిష్టం చేసేందుకు ఓటు పనిచేస్తుంది. దేశంలోని యువతను ఓటు వేయమని ప్రోత్సహించడం, ఓటరు జాబితాలో కొత్త ఓటర్లను చేర్చడం జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రధాన లక్ష్యం. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శిబిరాలు నిర్వహించడం, తొలిసారిగా ఓటర్లకు ఓటరు ఫొటో గుర్తింపు కార్డులు పంపిణీ చేయడం, నమోదు చేయడం లాంటివి ఉంటాయి.

Also Read: కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలివే!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు