International Education Day 2024:అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని జనవరి 24న మాత్రమే ఎందుకు జరుపుకుంటారు?

ప్రతీ ఏటా జనవరి 24 న అంతర్జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటారు 2024 లో ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే  పాఠశాలల్లో డ్రాపౌట్ స్టూడెంట్స్ శాతాన్ని తగ్గించడం, తద్వారా విద్యను రక్షించడం, లక్ష్యాలను సమీక్షించడం వంటి కార్యక్రమాలు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో చేపడతారు.

New Update
International Education Day 2024:అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని జనవరి 24న మాత్రమే ఎందుకు జరుపుకుంటారు?

International Education Day 2024:విద్య మనిషి ఆభరణం.సమాజంలో విద్యలేని మనిషి చీకటిలో ఉన్నట్లే లెక్క. ప్రపంచం ముందుకు పోతోంది. అయినా సరే .. ఇప్పటికి కూడా కనీస విద్యకు నోచుకోని వారున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. కారణాలు ఏమయినా ఇప్పటికి చాలా మంది పిల్లలు ప్రతీ ఏటా బడికి వెళ్లకుండా డ్రాపౌట్ అవుతున్నారన్న మాట వాస్తవం. ఈ పరిస్థితిని అధిగమాయించనే ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమే అంతర్జాతీయ విద్యా దినోత్సవ వేడుక.

2018 జనవరి 24న మొదటిసారి అంతర్జాతీయ విద్యా దినోత్సవం

ఈ ప్రపంచం అభివృద్హి చెందాలంటే విద్య కీలక పాత్ర పోషిస్తుంది. పురోగతి, సాధికారత,  సామాజిక మార్పుకు మూలస్తంభంలా నిలిచే విద్య గురించి ఓ వేడుక జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో అంతర్జాతీయ విద్యా దినోత్సవం   2018జనవరి 24న జరిగిన ఐక్యరాజ్యసమితి వేడుకగా  మొదటిసారి జరుపుకున్నారు. ఆ రోజు ఆ వేడుక విజయవంతం అవడంతో ఇక. ప్రతీ ఏటా ఈ అంతర్జాతీయ విద్య దినోత్సవాన్ని జరుపుతూ వస్తున్నారు. సమ్మిళిత సమానమైన విద్యా వ్యవస్థల అభివృద్ధిని  ప్రోత్సహించడం,  అందరికీ విద్య యొక్క విలువ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ దినోత్సవం యొక్క ఉద్దేశ్యం. ప్రజల జీవితాలను మార్చడానికి ,  మెరుగైన సమాజాన్ని సృష్టించడానికి విద్య యొక్క సామర్థ్యాన్ని కూడా ఈ రోజు తెలియజేస్తుంది.

 ప్రాముఖ్యత

అంతర్జాతీయ విద్యా దినోత్సవం రోజున ఉజ్వల భవిష్యత్తును నిర్మించడంలో విద్య పోషిస్తున్న కీలక పాత్రను గౌరవించే లక్ష్యంతో  ప్రపంచం నలుమూలల నుండి  ఉపాధ్యాయులు , విద్యావేత్తలు, సంస్థలు, ప్రభుత్వాలు కలిసి వస్తారు.విద్య యొక్క  నాణ్యతను పెంపొందించడానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవడానికి ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుంది, అందరికి సమగ్రమైన, న్యాయమైన,  నాణ్యమైన విద్యకు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశ్యాన్ని  ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది.

థీమ్
6వ  అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని జనవరి 24, 2024న “లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్” అనే థీమ్‌తో జరుపుకుంటారు. ఈ థీమ్ శాంతి మరియు అవగాహనను ప్రోత్సహించడంతో పాటు  విద్య యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. సమకాలీన ప్రపంచ సమస్యలపై సమగ్రమైన సమాచారాన్ని అందించడంలో  ఈ సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుంది.

763 మిలియన్ల పెద్దలు నిరక్షరాస్యులు

యునెస్కో నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా నేటికీ  250 మిలియన్ల మంది పిల్లలు మరియు యుక్తవయస్కులు పాఠశాలకు దూరంగా ఉన్నారు  763 మిలియన్ల పెద్దలు నిరక్షరాస్యులుగా ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది కదా. అందుకోసమే విదయ్ యొక్క ప్రాధాన్యతను

లక్ష్యాలు
పాఠశాలల్లో  డ్రాపౌట్ రేట్లను తగ్గించడం, తద్వారా విద్యను కాపాడడం వంటి లక్ష్యాలను సమీక్షించడం ఈ అంతర్జాతీయ వైద్యా దినోత్సవం ప్రధాన లక్ష్యం .రాబోయే తరానికి విద్య యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ , ఆర్థిక మాంద్యం,విపత్తుల సమయాల్లో ఎదురయే సవాళ్ళను ధైర్యం తో ఎదుర్కొనే మార్గాలను ఈ వేదికపై వినిపిస్తారు. గ్రామీణ స్థాయి నుంచి గ్లోబల్ స్థాయి వరకు విద్యావేత్తలు, ప్రభుత్వాలు మరియు సంస్థలు  చేపట్టే వివిధ కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వారికి విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులను తెలియజేస్తూ , ప్రతీ ఒక్కరూ బడికి వెళ్లాలని. అందరికి ఉన్నతప్రమాణాలతో కూడిన విద్య అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది.

Also Read:ఎస్సి,ఎస్టీ,బిసి మైనారిటీ వర్గాల సలహాదారు షబ్బీర్ అలీ 6 గ్యారంటీలు 100 డేస్ రివ్యూ మీటింగ్

Advertisment
తాజా కథనాలు