IPS OFFICER: నాడు ఇంటర్ ఫెయిల్.. నేడు ఐజీ!

12th ఫెల్యుూర్  సినిమాఐపీఎస్ అధికారి మనోజ్ శర్మ కు  ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పదోన్నతి పొందారు. ఈ విషయమై మనోజ్ శర్మ ప్రముఖ ఎక్స్ ద్వారా స్పందించారు.

New Update
IPS OFFICER: నాడు ఇంటర్ ఫెయిల్.. నేడు ఐజీ!

12th Failure :మనోజ్ శర్మ మధ్యప్రదేశ్‌లోని మొరెనా లో  నిరపేద పేద కుటుంబంలో జన్మించారు.  తన 12వ తరగతి పరీక్షల్లో హిందీ మినహా అన్ని సబ్జెక్టుల్లో మనోజ్ శర్మ ఫెయిల్ అయ్యాడు. 12వ తరగతి చదువుతున్నప్పుడు శ్రద్ధా జోషితో ప్రేమలో పడ్డాడు. 12వ తరగతి ఫెయిల్ కావడంతో జోషికి పెళ్లి ప్రపోజ్ చేయటానికి  భయపడ్డాడు. కానీ చాలాసేపటికి శర్మ జోషికి ప్రపోజ్ చేయగా ఆమె పెళ్లికి అంగీకరించింది. పెళ్లి తర్వాత మనోజ్ శర్మ చదువు పై దృష్టి సారించాడు.

యూపీఎస్సీ సీఎస్ఈకి ప్రిపేర్ కావడం ప్రారంభించాడు. శర్మ ఐపీఎస్ కావడానికి చాలా కష్టపడే వారు. ఒక పక్క చదువుకుంటూనే పార్ట్ టైమ్ జాబ్ చేసేవాడు. అతను ఢిల్లీలోని ఒక లైబ్రరీలో కూడా పనిచేశాడు, అది UPSCకి సిద్ధమవుతున్నప్పుడు అతనికి చాలా ఉపయోగకరంగా ఉండేది. శర్మ నాలుగు సార్లు యూపీఎస్, సీఎస్ఈ పరీక్షకు హాజరైనప్పటికీ మొదటి మూడు ప్రయత్నాల్లో విఫలమయ్యారు. తన నాల్గవ ప్రయత్నంలో ఆల్ ఇండియా 121 ర్యాంక్ ను సాధించాడు.

ఇటీవలె డైరెక్టర్ విధు వినోద్ చోప్రా పన్నెండవ వైఫల్యం అనే పేరుతో మనోజ్ శర్మ జీవిత కథ ఆధారంగా చిత్రాన్ని రూపోందిస్తున్నారు. ఈ నేపథ్యంలో  డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) నుంచి మహారాష్ట్ర పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ)గా మనోజ శర్మ పదోన్నతి పొందారు. దీంతో ప్రముఖ ఎక్స్ ద్వారా తనకు  మద్దతు గా నిలబడిన "అందరికీ" ధన్యవాదాలు తెలిపారు.

“ASPతో ప్రారంభమైన ప్రయాణం నేడు భారత ప్రభుత్వ సూచనల మేరకు ఆమె IG కావడానికి దారి తీసింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.”

Advertisment
తాజా కథనాలు