Shakib Al Hasan: T20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌పై బంగ్లాదేశ్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ వరుసగా వికెట్లు కోల్పొగా, వెటరన్ షకీబ్ అల్ హసన్ 46 బంతుల్లో 64 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు.అంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ స్వల్ప పరుగుల తేడాతో ఔటయ్యాడు.
అనంతరం భారత మాజీ క్రికెటర్ సెహ్వాగ్ (Virender Sehwag) మాట్లాడుతూ.. షకీబ్ అల్ హసన్ ఎక్కువ అనుభవం ఉన్న ఆటగాడు. చాలా కాలం పాటు బంగ్లాదేశ్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ టీ20 క్రికెట్‌లో షకీబ్ ప్రదర్శన పేలవంగా ఉందని సెహ్వాగ్ ఎక్స్ లో స్పందించాడు. అయితే తాజాగా షకీబ్ అల్ హసన్ టీ20 వరల్డ్ కప్ తర్వాత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు తెలిపాడు. అయితే సెహ్వాగ్ చేసిన విమర్శలపై ఆయన స్పందించాడు. ఏ ఆటగాడు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. జట్టు గెలవడానికి సహాయం చేయడమే ఆటగాడి పని. బ్యాట్స్‌మెన్‌గా, బౌలర్‌గా, ఫీల్డర్‌గా రాణించి జట్టును గెలిపించాలి. లేకపోతే ఎవరూ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదున్నాడు.
అలాగే, ఒక ఆటగాడు జట్టు విజయానికి సహకరించడంలో విఫలమైతే, కొంత చర్చ ఉంటుంది. అందులో తప్పేమీ లేదని నా అభిప్రాయం. కానీ నా ఆట గురించి నేనెప్పుడూ బాధపడలేదు. నా క్రికెట్ కెరీర్ మొత్తం ఇలాగే ఉన్నాను. క్రికెట్‌లో ఒక రోజు మీ రోజు అవుతుంది. మరొక రోజు మరొక ఆటగాడి రోజు అవుతుంది. బాగా బౌలింగ్ చేయడమే నా పని. వికెట్లు తీయాలంటే కొంచెం అదృష్టం అవసరమని భావిస్తున్నట్లు షకీబ్ అన్నాడు.