Hindenburg Story: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఏం చేస్తుంది? హిట్లర్ కు హిండెన్‌బర్గ్ కు మధ్య లింకేంటి?

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇప్పుడు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో అదానీ గ్రూప్ పై ఆరోపణలతో సంచలనం సృష్టించిన హిండెన్‌బర్గ్ ఇప్పుడు ఏకంగా సెబీ చీఫ్ పై ఆరోపణలు చేసింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఎవరిది? ఇది ఎలా పనిచేస్తుంది? ఆసక్తికర విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు..

Hindenburg Story: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఏం చేస్తుంది? హిట్లర్ కు హిండెన్‌బర్గ్ కు మధ్య లింకేంటి?
New Update

Hindenburg Story: దాదాపు ఏడాదిన్నర తరువాత మళ్ళీ హిండెన్‌బర్గ్ అనే పేరు మారుమోగుతోంది. అప్పట్లో అదానీ గ్రూప్ కంపెనీలపై తీవ్ర ఆరోపణలతో సంచలనం రేపింది హిండెన్‌బర్గ్. దీంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు కిందికి పడిపోవడమే కాకుండా.. మన స్టాక్ మార్కెట్ కూడా పూర్తిగా నష్టాల్లో పడిపోయింది. క్రమేపీ.. ఆ హడావుడి సర్దుమణిగింది. ప్రస్తుతం అన్నీ సవ్యంగా నడుస్తూ.. మన స్టాక్ మర్కెట్లు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. అదానీ గ్రూప్ కంపెనీలు కూడా పుంజుకున్నాయి. సరిగ్గా ఈ సమయంలో మరోసారి హిండెన్‌బర్గ్ మరో రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈసారి సెబీ చీఫ్ మాధబి పూరీ బుచ్  పైనే ఆరోపణలు చేసింది హిండెన్‌బర్గ్. దీంతో మరోసారి దేశ వాణిజ్య విభాగాల్లోని కాకుండా.. రాజకీయంగా కూడా ప్రకంపనలు రేగుతున్నాయి. ఈ రిపోర్ట్ నేపథ్యంలో ఈరోజు అంటే ఆగస్టు 12న అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పడిపోయాయి. ఈ క్రమంలో అసలు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అంటే ఏమిటి? అదానీ మీద హిండెన్‌బర్గ్ చేసిన అప్పటి ఆరోపణలు ఏమిటి? ఇప్పుడు సెబీ చీఫ్ పై చేస్తున్న ఆరోపణలు ఏమిటి? ఈ వీసీహాయాలను వివరంగా తెలుసుకుందాం. 

హిండెన్‌బర్గ్ తాజా ఆరోపణలు ఇవీ.. 

Hindenburg Story: సెబీ చైర్‌పర్సన్ మధాబీ పూరీ బుచ్‌పై అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తీవ్ర ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలతో ముడిపడి ఉన్న ఆఫ్‌షోర్ కంపెనీల్లో మాధబి పూరీ బుచ్ మరియు ఆమె భర్త ధవల్ బుచ్‌లకు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ పేర్కొంది. అదానీ గ్రూప్‌కు చెందిన అనుమానాస్పద వాటాదారుల కంపెనీలపై సెబీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని హిండెన్‌బర్గ్ తన లేటెస్ట్ రిపోర్ట్ లో పేర్కొంది. ఈ కంపెనీలను  ఇండియా ఇన్ఫోలైన్ EM రీసర్జెంట్ ఫండ్, ఇండియా ఫోకస్ ఫండ్ నిర్వహిస్తున్నాయి. 

హిండెన్‌బర్గ్ తాజా రిపోర్ట్ ఏమి చెబుతోంది?

Hindenburg Story: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సెబీలో తన నియామకానికి కొన్ని వారాల ముందు, మారిషస్ ఆధారిత ఫండ్ అడ్మినిస్ట్రేటర్ ట్రైడెంట్ ట్రస్ట్‌కు ఇ-మెయిల్ పంపినట్లు చూపించే పత్రాలు ఉన్నాయని పేర్కొంది. గ్లోబల్ డైనమిక్ ఆపర్చునిటీస్ ఫండ్‌లో మాధబి బుచ్ సెబి చైర్మన్ కాకముందు, ఆమె భర్త అన్ని ఖాతాలను ఆపరేట్ చేయాలని రిక్వస్ట్ చేసినట్టు నివేదిక పేర్కొంది. అంటే ఆమె సెబీ చైర్మన్ కాకముందే తన భార్యకు చెందిన అన్ని ఖాతాల నుంచి ఎస్సెట్స్ తొలగించాలనుకున్నాడు.

Hindenburg Story: హిండెన్‌బర్గ్ క్లెయిమ్‌పై సెబీ చైర్మన్ మధాబి పూరీ బుచ్ - ఆమె భర్త ధవల్ బుచ్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. మా జీవితం, ఆర్థిక లావాదేవీలు తెరిచిన పుస్తకం లాంటివి అని ఈ సందర్భంగా చెప్పారు. 

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అంటే..  

Hindenburg Story: ఈ కంపెనీకి 'హిండెన్‌బర్గ్' అనే పేరు ఎలా వచ్చిందనేది కూడా ఆసక్తికరమే. దీనికోసం చరిత్రలోకి వెళ్ళాలి. 1937లో జర్మనీలోహిట్లర్‌ పాలనలో ఉండేది. జర్మనీ ట్యాంకుల నుండి విమానాలు, యుద్ధ విమానాల వరకు ప్రతిదీ తయారు చేయడంలో బిజీగా ఉంది. అప్పట్లో అక్కడ వాణిజ్య ప్రయాణీకుల విమానాన్ని నిర్మించి దానికి 'హిండెన్‌బర్గ్ ఎయిర్‌షిప్' లేదా LZ 129 హిండెన్‌బర్గ్ అని పేరు పెట్టారు. ఆ కాలంలో ఇదే అతిపెద్ద వాణిజ్య విమానం. మే 6, 1937 న, ఈ విమానం జర్మనీ నుండి అమెరికాకు వెళ్లింది. న్యూజెర్సీకి చేరుకోగానే ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. 

Hindenburg Story: ప్రజలు అర్థం చేసుకుని ఏదైనా చేసేలోపే భారీ మంటలు ఎగసిపడ్డాయి. 30 సెకన్లలోపే నేలపై పడిపోయింది. విమానంలో  ఉన్న 100 మందిలో 35 మంది మరణించారు. ఈ విమానంలో  హైడ్రోజన్ గ్యాస్‌తో కూడిన 16 పెద్ద బెలూన్‌లు ఉన్నాయని, ఇంతకుముందు కూడా అలాంటి బెలూన్‌ల వల్ల ప్రమాదాలు జరిగాయని రిపోర్ట్స్ చెప్పాయి.  

ఇక ప్రస్తుతంలోకి వస్తే..  ఈ ప్రమాదంతో  హిండెన్‌బర్గ్ కంపెనీ పేరు ముడిపడి ఉంది. హిండెన్‌బర్గ్ వెబ్‌సైట్‌ను పరిశీలిస్తే, స్టాక్ మార్కెట్‌లో జరుగుతున్న అక్రమాలపై ఈ కంపెనీ నిఘా ఉంచుతుందని స్పష్టమవుతుంది. ఇది విజిల్ బ్లోయర్ లాగా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఆర్థిక అవకతవకలు, అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో ఆర్థిక ప్రమాదాల నుండి ప్రజలను రక్షించడం కంపెనీ లక్ష్యం. అందుకే దీనికి హిండెన్‌బర్గ్ అని పేరుపెట్టామని నిర్వాహకులు పేర్కొన్నారు. 

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఎవరిది? 

Hindenburg Story: హిండెన్‌బర్గ్ ను 2017లో నాథన్ ఆండర్సన్ స్థాపించారు. అతన్ని నేట్ ఆండర్సన్ అని కూడా పిలుస్తారు. అమెరికాలోని కనెక్టికట్ యూనివర్శిటీలో చదివిన నాథన్, ఫ్యాక్ట్ సెట్ రీసెర్చ్ సిస్టమ్ అనే డేటా సంస్థతో కెరీర్ ప్రారంభించి ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలతో కలిసి పనిచేశాడు. వాల్ స్ట్రీట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, అండర్సన్ తన ఉద్యోగ సమయంలో, తన కొలీగ్స్ చాలా సరళమైన విశ్లేషణ చేస్తున్నారని గ్రహించినట్లు చెప్పాడు. ఇది చూసిన తరువాత సొంతంగా సంస్థను ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. 

అంబులెన్స్ డ్రైవర్‌గా కూడా.. 

అతనికి 400 గంటల పాటు అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉందని అతని లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ చూపిస్తుంది. అండర్సన్ అమెరికన్ అకౌంటెంట్ హ్యారీ మార్కోపోలోస్‌ను తన రోల్ మోడల్‌గా చెబుతాడు. ఆండర్సన్ గురువుగా చెప్పుకునే ఈ మార్కోపోలోస్  2008లో అమెరికన్ స్టాక్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించాడు. పోంజీ పథకాల గురించి ఆయన వెల్లడించారు. నెట్‌ఫ్లిక్స్ ప్రసిద్ధ వెబ్ సిరీస్ “ది మాన్‌స్టర్ ఆఫ్ వాల్ స్ట్రీట్” లో ఈ కథనం అందుబాటులో ఉంది. 

హిండెన్‌బర్గ్ పరిశోధన ఎలా చేస్తుంది?
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనేక పారామితులపై కంపెనీ నివేదికలను సిద్ధం చేస్తుంది. హిండెన్‌బర్గ్ నివేదిక ప్రధానంగా మూడు విషయాలపై ఆధారపది ఉంటుంది. మొదట అతను పెట్టుబడి డేటాను విశ్లేషిస్తాడు. రెండవది, వారు పరిశోధనాత్మక పరిశోధనలు చేస్తారు.  మూడవది, వారు తమ పరిశోధనల ఆధారంగా మూలాల నుండి పొందిన రహస్య సమాచారాన్ని కూడా అందులో పొందుపరుస్తారు. హిండెన్‌బర్గ్ కంపెనీ తన పరిశోధనల్లో కంపెనీ అకౌంటింగ్‌లో అవకతవకలు, ముఖ్యమైన పదవులను కలిగి ఉన్న వ్యక్తుల నేపథ్యం, ​​బహిర్గతం చేయని లావాదేవీలు, ఆ కంపెనీల చట్టవిరుద్ధమైన లేదా అనైతికమైన వ్యాపారాల గురించి కూడా దర్యాప్తు చేస్తుంది.

అదానీ పై హిండెన్‌బర్గ్ నివేదిక
జనవరి 2023లో అదానీ గ్రూప్ కంపెనీలపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. 2020 - 2023 మధ్య, అదానీ గ్రూప్ తన ఏడు ప్రధాన లిస్టెడ్ కంపెనీల స్టాక్ ధరలను మార్చడం ద్వారా $100 బిలియన్లకు పైగా సంపాదించిందని పేర్కొంది. హిండెన్‌బర్గ్ ఈ వాదన భారత స్టాక్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించింది. అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు ఒక్కసారిగా నేలకు పడిపోయాయి.

అదానీ కంటే ముందు కూడా హిండెన్‌బర్గ్ అనేక కంపెనీల గురించి ఇలాంటి వాదనలు, నివేదికలను బయటపెట్టింది. అదానీ గ్రూప్‌తో సహా వివిధ కంపెనీల మొత్తం 19 నివేదికలు దాని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అదానీ గ్రూప్ కంటే ముందు, 2020 సంవత్సరంలో, నికోలా అనే అమెరికన్ ఎలక్ట్రిక్ ఆటో కంపెనీలో అక్రమాలు బయటపడ్డాయి. ఈ ప్రకటన తర్వాత కంపెనీ షేర్లు 24% పడిపోయాయి. కంపెనీ అధిపతి రాజీనామా చేయాల్సి వచ్చింది. 120 మిలియన్ డాలర్ల జరిమానా కూడా అతనిపై విధించారు. 

#hindenburg-research
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe