/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/feb-29-jpg.webp)
Leap Day 2024:ప్రతి ఏడాది ఫిబ్రవరి నెల 28 రోజులకే ముగుస్తుంది. కానీ ఈ ఏడాది మాత్రం ఫిబ్రవరికి 29 రోజులు ఉన్నాయి. ఇలా నాలుగేళ్లకొసారి ఫిబ్రవరి నెలకి ఓ రోజు అదనంగా చేరుతుంది. దీనిని లీప్ ఇయర్ (Leap Year) అంటారు. అసలు లీప్ ఇయర్ అంటే ఏమిటి? అది నాలుగేళ్లకు ఓసారి మాత్రమే ఎందుకు వస్తుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి సంవత్సరం..12 నెలలకు కలిపి 365 రోజులు ఉంటాయి. కానీ ఈ లీప్ ఇయర్ వచ్చినప్పుడు మాత్రం ఇంకో రోజు అదనంగా చేరి 366 రోజులు ఉంటాయి. ఆ ఒక్కరోజు ఫిబ్రవరి నెలకు మాత్రమే వస్తుంది. ఈ ఏడాది వచ్చిన లీపు సంవత్సరం మళ్లీ 2028లో వస్తుంది. నాలుగుతో విభజించే ప్రతి సంవత్సరం లీప్ ఇయరే అవుతుంది. అంటే 2016, 2020, 2024, 2028, 2032,2036 ఇ సంవత్సరాలు అన్ని కూడా లీపు సంవత్సరాలే.
అంతేకాకుండా 00 తో ముగిసే సంవత్సరాలకు లీపు రాదు. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే గ్రెగోరియన్ క్యాలెండర్ లో మాత్రమే కాకుండా హిబ్రూ, చైనీస్, ఇథియోపియన్ , ఇస్లామిక్ క్యాలెండర్లలో కూడా లీపు సంవత్సరాలు ఉంటాయి. కొన్ని క్యాలెండర్లలో అయితే లీప్ సెకన్లు కూడా ఉంటాయి.
అసలు లీపు సంవత్సరం ఎప్పుడు ఎలా వచ్చిందంటే..:
క్రీస్తు పూర్వం గ్రీస్, రోమన్ లు క్యాలెండర్ లోని రోజుల్ని, నెలలనూ ఇష్టమోచ్చినట్లు మార్చేసేవాళ్లు. రోమన్ చక్రవర్తి జూలియస్ కాసర్ చక్రవర్తిగా ఉన్న సమయంలో ఏడాదికి 355 రోజులు మాత్రమే ఉండేవి. అలా ప్రతి రెండేళ్లకొసారి 22 రోజులు ఉన్న ఓ నెల ఎక్కువగా వచ్చి చేరేది. జూలియస్ వచ్చాక క్యాలండర్ లో అనే మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో సంవత్సరానికి 365 రోజులు వచ్చి చేరాయి. అలా ప్రతి నాలుగేళ్లకొసారి ఓ అదనపు రోజు... ఆగస్టు నెలలో కలిపారు.
ఎందుకుంటే అప్పట్లో ఫిబ్రవరికి 30 రోజులు ఉండేవి. జులైకి 31 రోజులు, ఆగస్టుకు 29 రోజులు ఉండేవి. జూలియస్ కాసర్ తరువాత ఆగస్టస్ చక్రవర్తి అయ్యాడు. ఆగస్టస్ పేరు మీదుగా ఆగస్టు నెల వచ్చి చేరింది. ఆ నెలలో రోజులు తక్కువగా ఉండటం ఆయన ఇష్టపడలేదు. దీంతో ఆగస్టు నెలకు మరో రెండు రోజులు పెంచుకున్నాడు.
జూలియస్ కాసర్ ఫిబ్రవరిలో పుట్టాడు.. దాంతో ఆ రెండు రోజులూ తగ్గించాడు. ఫలితంగా ఆగస్టుకి 31 రోజులు, ఫిబ్రవరికి 28 రోజులు వచ్చాయి. అప్పటి నుంచి లీపు ఇయర్ లో 1 రోజును ఆగస్టుకి కాకుండా..ఫిబ్రవరి కి కలపడం జరిగింది. దీంఓ ఫిబ్రవరిలో 28 , 29 రోజులు ఉండటానికి కారణం అయ్యింది.
Also read: రోగనిరోధక శక్తిని పెంచే ఈ 5రకాల పండ్లు తీసుకోండి.. రోగాలు మీ దరి చేరవు!