Economic Survey 2024: బడ్జెట్ ముందు ఆర్ధిక సర్వే ఎందుకు పార్లమెంట్ లో సమర్పిస్తారు? 

ఆర్థిక సర్వే రిపోర్ట్ ను బడ్జెట్‌కు ఒక రోజు ముందు పార్లమెంటులో ప్రవేశ పెడతారు.  ఈరోజు బడ్జెట్ - 2004 ఆర్ధికసర్వే రిపోర్టు రానుంది. దీనిని  ప్రతి సంవత్సరం ఆర్థిక సలహాదారు నేతృత్వంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ తయారు చేస్తుంది. దానిని పార్లమెంటులో ఆర్థిక మంత్రి సమర్పిస్తారు. 

Economic Survey 2024: బడ్జెట్ ముందు ఆర్ధిక సర్వే ఎందుకు పార్లమెంట్ లో సమర్పిస్తారు? 
New Update

Economic Survey 2024:  ఆర్థిక సర్వే ఏడాదికి ఒకసారి ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక రికార్డు బుక్. ఇది గత ఆర్థిక సంవత్సరం దేశ ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. అలాగే, రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఎలా ఉంటుందో అంచనా వేస్తుంది.  ఒక విధంగా ఇది భారతదేశ ఆర్థిక పరిస్థితిపై ఒక అంచనాను ఇస్తుంది.  దీన్ని  సాధారణంగా కేంద్ర బడ్జెట్ సమర్పణకు ఒక రోజు ముందు పార్లమెంటులో సమర్పిస్తారు.  బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే రోజునే ఇది పార్లమెంటు పరిశీలనకు అందుబాటులో ఉంటుంది. బడ్జెట్‌కు ముందు పార్లమెంటు సభ్యులు ఆర్థిక పరిస్థితి కి సంబంధించిన విషయాలను తెలుసుకోవడం కోసం దీనిని సమర్పిస్తారని చెప్పుకోవచ్చు. 

ఆర్థిక సర్వే నివేదికను ఎవరు సిద్ధం చేస్తారు?
Economic Survey 2024:  దేశ ప్రధాన ఆర్థిక సలహాదారు మార్గదర్శకత్వంలో ఆర్థిక మంత్రిత్వ శాఖలోని అధికారులు ఆర్థిక సర్వేను తయారు చేస్తారు. ప్రస్తుతం CEA వి. అనంతనాగేశ్వరన్. ఈ సర్వేను తాను సిద్ధం చేసినా.. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేది ఆర్థిక మంత్రి. జూలై 22న నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు.

ఆర్థిక సర్వేలో ఏమి ఉంటుంది?
Economic Survey 2024: ఆర్థిక సర్వే మూడు భాగాలను కలిగి ఉంటుంది. మొదటి భాగంలో, CEA దేశం ప్రధాన ఆర్థిక సమస్యలపై తన దృక్కోణంపై అభిప్రాయాన్ని చెబుతుంది. ప్రభుత్వ విధానం ఎలా ఉంటుందో దానికి ఇది రిఫ్లేక్షన్  కావచ్చు. ఈ అభిప్రాయాన్ని బడ్జెట్‌లో అమలు చేయవచ్చని ఖచ్చితంగా చెప్పలేము.

Economic Survey 2024: ఇంకా, ఈ సర్వే రెండవ భాగం ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల నుండి డేటాను కలిగి ఉంటుంది. ఈ గణాంకాలు వివిధ శాఖలు, మంత్రిత్వ శాఖల నుండి సేకరించినవి అయి ఉంటాయి. 

మూడవ భాగం జాతీయ ఆదాయం, ఉత్పత్తి, ఉపాధి, ద్రవ్యోల్బణం, వాణిజ్య సమతుల్యత, ఎగుమతి-దిగుమతి వాణిజ్యం, ఇతర స్థూల ఆర్థిక గణాంకాలను కవర్ చేస్తుంది.

#union-budget-2024 #economic-survey-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe