Economic Survey 2024: ఆర్థిక సర్వే ఏడాదికి ఒకసారి ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక రికార్డు బుక్. ఇది గత ఆర్థిక సంవత్సరం దేశ ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. అలాగే, రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఎలా ఉంటుందో అంచనా వేస్తుంది. ఒక విధంగా ఇది భారతదేశ ఆర్థిక పరిస్థితిపై ఒక అంచనాను ఇస్తుంది. దీన్ని సాధారణంగా కేంద్ర బడ్జెట్ సమర్పణకు ఒక రోజు ముందు పార్లమెంటులో సమర్పిస్తారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే రోజునే ఇది పార్లమెంటు పరిశీలనకు అందుబాటులో ఉంటుంది. బడ్జెట్‌కు ముందు పార్లమెంటు సభ్యులు ఆర్థిక పరిస్థితి కి సంబంధించిన విషయాలను తెలుసుకోవడం కోసం దీనిని సమర్పిస్తారని చెప్పుకోవచ్చు.
పూర్తిగా చదవండి..Economic Survey 2024: బడ్జెట్ ముందు ఆర్ధిక సర్వే ఎందుకు పార్లమెంట్ లో సమర్పిస్తారు?
ఆర్థిక సర్వే రిపోర్ట్ ను బడ్జెట్‌కు ఒక రోజు ముందు పార్లమెంటులో ప్రవేశ పెడతారు. ఈరోజు బడ్జెట్ - 2004 ఆర్ధికసర్వే రిపోర్టు రానుంది. దీనిని ప్రతి సంవత్సరం ఆర్థిక సలహాదారు నేతృత్వంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ తయారు చేస్తుంది. దానిని పార్లమెంటులో ఆర్థిక మంత్రి సమర్పిస్తారు.
Translate this News: