Weight Loss Tips: ఈ బ్రేక్ ఫాస్ట్ కాంబినేషన్‌ని పాటించి చూడండి.. దెబ్బకు బరువు తగ్గుతారు!

చాలా మంది బరువు తగ్గడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు. కొంత మంది బరువు తగ్గాలని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కేవలం జ్యూస్ తో సరిపెట్టుకుంటారు. కానీ ఈ సింపుల్ బ్రేక్ ఫాస్ట్ కాంబినేషన్స్ బరువు తగ్గడానికి సహాయపడును. ఇడ్లీ - సాంబర్, పోహా, మొలకెత్తిన గింజలు, వెజిటబుల్ ఉప్మా..

New Update
Weight Loss Tips: ఈ బ్రేక్ ఫాస్ట్ కాంబినేషన్‌ని పాటించి చూడండి.. దెబ్బకు బరువు తగ్గుతారు!

Weight Loss Tips: ఈ మధ్య కాలంలో జీవన శైలి విధానాలు, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది బరువు పెరగడం, ఊబకాయం సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇక బరువు తగ్గడానికి.. జిమ్ కి వెళ్లి వ్యాయామాలు చేయడం, డైటింగ్ చేయడం ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంత మంది బరువు పెరుగుతున్నారని.. బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్ మానేస్తూ ఉంటారు. ఇవన్నీ కాకుండా ఈ సింపుల్ బ్రేక్ ఫాస్ట్ కాంబినేషన్స్ పాటిస్తే ఈజీ గా బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.

బరువు తగ్గడానికి సహాయపడే బ్రేక్ ఫాస్ట్ కాంబినేషన్స్..

ఓట్స్ తో పాటు పెరుగు, బెర్రీస్ కలిపి తినండి

ఓట్స్ లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉంది అనే భావనను కలిగించడంతో పాటు రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రించి బరువు తగ్గడంలో సహాయపడును. అలాగే పెరుగులోని ప్రోబయోటిక్ గుణాలు ప్రేగు ఆరోగ్యంతో పాటు జీవక్రియను నిర్వహించడంలో తోడ్పడును.

publive-image

పోహా, మొలకెత్తిన గింజలు

పోహాలో ఐరన్, ఫైబర్ శాతం ఎక్కువ, మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. కావున బ్రేక్ ఫాస్ట్ లో ఈ రెండింటి కాంబినేషన్ శరీరంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ స్థాయిలను సమానంగా ఉంచి బరువు తగ్గడంలో సహాయపడును.

publive-image

ఇడ్లీ, సాంబార్

బ్రేక్ ఫాస్ట్ లో ఇది చాలా బెస్ట్ కాంబినేషన్. హెవీ బ్రేక్ ఫాస్ట్.. పూరీ, బోండా, దోస నచ్చని వాళ్ళు ఈ కాంబినేషన్ బాగా ఇష్టపడతారు. ఆవిరి పై చేయడం వల్ల ఇడ్లీలో తక్కువ ఫ్యాట్, కేలరీలు కంటెంట్ తక్కువగా ఉంటాయి. ఇక సాంబార్ లో వేసే కూరగాయల్లో ప్రోటీన్, ఫైబర్ ను ఎక్కువగా కలిగి ఉండడంతో ఈ రెండింటి కాంబినేషన్ బరువు తగ్గడానికి మంచి ఎంపిక.

publive-image

వెజిటబుల్ ఉప్మా

ఉప్మా తక్కువ ఫ్యాట్, కేలరీలను కలిగి ఉంటుంది. అలాగే దీనిలోని అధికంగా ఉండే ప్రోటీన్, ఫైబర్ గుణాలు బరువు తగ్గడానికి సహాయపడును. అంతే కాదు దీనిలో కూరగాయలను కలిపి తీసుకోవడం వాళ్ళ వాటిలోని ఫైబర్ గుణాలు సులువుగా బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.

publive-image

బ్రేడ్ విత్ ఎగ్ వైట్ ఆమ్లెట్

గుడ్డులోని ఎల్లో కాకుండా.. వైట్ మాత్రమే తీసుకొని ఆమ్లెట్ వేయాలి. ఎగ్ వైట్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు ఫైబర్ ఎక్కువగా ఉన్న గోధుమలతో చేసిన బ్రేడ్ తింటే చాలా సమయం వరకు కడుపు నిండుగా ఉండి.. బరువు తగ్గడానికి సహాయపడును.

publive-image

Also Read: దీపావళి పండుగకు అభ్యంగన స్నానం వల్ల కలిగే లాభాలు మీకు తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు