Ways to Accept Failure: ఒకసారి లైఫ్ లో ఫెయిల్ అయితే.. చాలు ఇక ఏదీ సాధించలేము అనే భావనతో కొంత మంది నిరాశ చెందుతారు. జీవితంలో ఓటమి ఎదురైనప్పుడే గెలుపు విలువ తెలుస్తుంది. ఓడిపోయినప్పుడు నిరాశ చెందకుండా జీవితంలో ఈ సింపుల్ సలహాలు పాటిస్తే ఓటమి బాధ నుంచి బయట పడొచ్చు.
ఓటమిని అంగీకరించడానికి సింపుల్ టిప్స్
భావోద్వేగాలను గుర్తించండి
ఏదైనా సాధించడంలో ఫెయిల్ అయినప్పుడు ముందుగా దానిని అంగీకరించేలా సెట్ చేసుకోవాలి. ఫెల్యూర్ నుంచి కలిగే ప్రతీ ఎమోషన్ .. బాధ, కోపం, చిరాకు ఏదైనా తీసుకునేలా ఉండాలి. నిరాశ చెందకుండా మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్ గా ఉండడానికి ప్రయత్నించాలి.
తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి
తప్పు జరిగినప్పుడు బాధపడడం మానేసి ఆ తప్పు జరగడానికి కారణం ఏంటీ అనే విషయం పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇప్పుడు జరిగిన మిస్టేక్స్ గురించి తెలుసుకొని భవిష్యత్తులో మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడాలి. తప్పులను సరి చేసుకోవడానికి ఓటమి ఒక మంచి అవకాశంగా భావించాలి.
ఆలోచన విధానం మార్చుకోండి
లైఫ్ లో ఒక్కసారి ఫెయిల్ అయితే జీవితంలో ఇంకా ఏది సాధించలేము అనే ఆలోచన మానేయండి. ఫెల్యూర్ ను శాశ్వత ఓటమిగా చూడకుండా కేవలం తాత్కాలికంగా భావించి ముందుకు వెళ్ళాలి.
ముందుకు వెళ్ళాలి అనే మైండ్ సెట్ తో ఉండాలి
జీవితంలో ఎప్పుడైనా మనకు తగిలే ఎదురు దెబ్బలు, ఓటమిని భవిష్యత్తులో ముందుకు వెళ్ళడానికి ఒక మంచి అవకాశంగా భావించాలి. సానుకూల మనస్తత్వాన్ని కలిగి మెరుగైన జీవితం పై ద్రుష్టి పెట్టడానికి ప్రయత్నించాలి. ఓటమిని గెలుపుకు పునాదిగా భావించాలి.
పెద్ద వారి నుంచి సలహాలు తీసుకోండి.
ఓడిపోయినప్పుడు మీ అనుభవాలను మీ మనసుకు దగ్గరగా ఉన్న వారతో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, వెల్ విషర్స్ అభిప్రాయాలను తీసుకుంటే అవి మీ ఫెల్యూర్ ను అధికమించి సక్సెస్ వైపు వెళ్ళడానికి ప్రోత్సహిస్తాయి.
విజయాలను సెలెబ్రేట్ చేసుకోండి
జీవితంలో చిన్న చిన్న విజయాలను, ఆనందాలను సెలబ్రేట్ చేసుకోవాలి దాని వల్ల మనలో సాధించాలనే పట్టుదల కూడా పెరుగుతుంది. అది మీ జీవిత లక్ష్యం కాకపోయిన.. జీవితంలో జరిగే ప్రోగ్రెస్ ను సెలెబ్రేట్ చేసుకోవాలి.
Also Read: Constiation Tips: మలబద్ధకం సమస్య ఉందా.. ఇవి పాటిస్తే దెబ్బకు మాయం..!