Crime News: వరంగల్ జిల్లా మైసంపల్లిలో దారుణం.. భర్త ఇంట్లో లేని సమయంలో..

వరంగల్ జిల్లా మైసంపల్లిలో వెంగల సుప్రియ అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. మెడలో బంగారు గొలుసు, చెవి కమ్మలు, ఇంట్లో డబ్బు, బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. భర్త పనికి, పిల్లలు స్కూలుకు వెళ్లిన సమయంలో ఈ దారుణ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

New Update
Crime News: వరంగల్ జిల్లా మైసంపల్లిలో దారుణం.. భర్త ఇంట్లో లేని సమయంలో..

Warangal: వరంగల్ జిల్లా మైసంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. వెంగల సుప్రియ అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. సుప్రియ మొహంతో పాటు ఒంటిపై గాయాలు ఉన్నాయని.. మొహంపై దిండుతో నులిమిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని బాధిత బంధువులు వాపోతున్నారు. మెడలో బంగారు గొలుసు, చెవి కమ్మలు మాయం అయ్యాయని.. ఇంట్లో డబ్బు, బంగారు ఆభరణాల చోరీకి గురయ్యాయని తెలుస్తోంది.

Also Read: టీడీపీ నేతల ఫోన్ ట్యాపింగ్ కలకలం.. కేశినేని చిన్ని ఆరోపణలు!

మృతురాలి ఇంటి స్థలంలో బిర్యానీ ప్యాకెట్లు ఉండడంపై భార్య మృతిపై భర్త కిరణ్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. భర్త పనికి, పిల్లలు స్కూలుకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. సుప్రియది హత్యా, ఆత్మహత్యా? సుప్రియపై అత్యాచారం జరిగిందా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు