/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/tpt-1-2.jpg)
Volunteers: ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఎంత కీలకంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం రూ. 5 వేలకే ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం కోసం పనిచేశారు. అయితే, ఎన్నికల టైంలో వాలంటీర్ వ్యవస్థ సేవలకు న్యాయస్థానం అడ్డుచెప్పింది. దీంతో రాష్ట్రంలోని పలుచోట్ల వైసీపీకి మద్దతు తెలుపుతూ వాలంటీర్లు రాజీనామ చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ వ్యవస్థ ఉండదనే ప్రచారం కూడా జరిగింది. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారని చెప్పారు.
Also Read: ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలి.. కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన..!
అయితే, తమను బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు కమిషనర్‌కు పిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో కౌన్సిలర్లపై వాలంటీర్లు మున్సిపల్ కమిషనర్‌కు కంప్లైంట్ చేశారు. తమను బలవంతంగా రాజీనామా చేయించారని కమిషనర్‌కు పిర్యాదు చేశారు. తమను ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.