AP: ఏదైనా సమస్య వస్తే ఇలా చేయండి: ఎమ్మెల్యే విజయలక్ష్మి

విజయనగరంలో 23,303 మంది పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ ఇచ్చినట్లు తెలిపారు ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి. ఇక నుంచి నేరుగా ఇంటి వద్దకే వచ్చి సచివాలయ సిబ్బంది పెన్షన్ ఇస్తారన్నారు. ఏదైనా సమస్య వస్తే తనను సంప్రదించాలన్నారు.

AP: ఏదైనా సమస్య వస్తే ఇలా చేయండి: ఎమ్మెల్యే విజయలక్ష్మి
New Update

MLA Vijayalakshmi : ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం (NTR Bharosa Pension Scheme) కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలోనే మొదటిసారిగా వెల్ఫేర్ ను ప్రారంభించిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. నాడు పేద ప్రజలు బతకడానికి కోసం నందమూరి తారక రామారావు ఈ స్కీం తెచ్చారన్నారు.

Also Read: అందుకే జీతం తీసుకోలేదు: పవన్ కళ్యాణ్

నేడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆదేశాల మేరకు ఉదయం 6 గంటలకు లబ్ధిదారులకు పెన్షన్ అందజేసినట్లు తెలిపారు. విజయనగరంలో 23,303 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారన్నారు. ఇక నుంచి నేరుగా ఇంటి వద్దకే వచ్చి సచివాలయ సిబ్బంది పెన్షన్ ఇస్తారని వెల్లడించారు. ఏదైనా సమస్య వస్తే తనను సంప్రదించాలన్నారు.

#mla-vijayalakshmi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe