Vizag triangle Love story: ఫేక్ లవ్వొ.. టైమ్ పాస్ లవ్వొ.. ధైర్యం లేని లవ్వొ.. కొవ్వు పట్టిన లవ్వొనన్నది పక్కన పెడితే ఇటివల కాలంలో ప్రేమ ఒకరితో పెళ్లి మరొకరితో తరహా లవ్ స్టోరీలు కుప్పలుతెప్పలుగా వినిపిస్తున్నాయి. మన కళ్ల ముందే కనిపిస్తున్నాయి కూడా! ఒకరిద్దరితో ప్రేమ వ్యవహరం నడపడం.. ఒక లవర్ ఉండగానే మరో ప్రేమని వెతుక్కోవడం.. అందులో ఒకరిని చీట్ చేయడం లాంటివి చూస్తున్నే ఉన్నాం. అయితే విశాఖలో జరిగిన కథ కాస్త భిన్నం. ఇద్దరిని ఓకే సమయంలో ప్రేమించిన యువతి.. ఆ ఇద్దరిలో ఒకరిని కాకుండా మరో వ్యక్తిని గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంది. అనేక మలుపులు తిరిగిన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అటు తిరిగి ఇటు తిరిగి విషాదంగా ముగిసింది. ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది.
పూర్తిగా చదవండి..Love suicides: ఇద్దరి ప్రాణాలు తీసిన ట్రయాంగిల్ లవ్ ట్రాజడీ! విశాఖలో ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు!
విశాఖలోని గోపాలపట్నంలో జరిగిన ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషాదంగా ముగిసింది. ఒకే సమయంలో ఇద్దరిని ప్రేమించిన 17ఏళ్ల బాలిక.. ఆ ఇద్దరిలో ఒకరిని కాకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా వారితో రిలేషన్‌షిప్ కొనసాగించడంతో ఈ విషయం భర్తకు తెలిసిపోవడం.. అదే సమమంలో ఇద్దరు ప్రేమికులు ఇంటికి రావడంతో మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఇది తెలుసుకున్న ఇద్దరి ప్రియుల్లో ఒకరు సూసైడ్ చేసుకున్నాడు.
Translate this News: