Viveka Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్..!

వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల పూచికత్తు సమర్పిచాలని.. ప్రతి వారం సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని ఆదేశిచింది. అలాగే ఏపీలో ప్రవేశించకూడదని షరతు పెట్టింది.

New Update
Viveka Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్..!

Viveka Case Update: ఏపీలో మాజీ ఎంపీ, వైఎస్ వివేకా హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. హత్య జరిగి ఐదేళ్లు కావోస్తున్న వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి ఇప్పటికీ తన తండ్రి చావుకు కారణమైన వారికి శిక్ష పడాలని పోరాడుతూనే ఉన్నారు.  ఈ హత్యలో నిందితులుగా ఉన్నవారు వైసీపీకి చెందినవారు కావడంతో ఇప్పటికీ న్యాయం జరగడం లేదని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Also Read: ఉత్తరప్రదేశ్ ఘాజీపూర్ లో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి..!

అయితే, తాజాగా, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పలు షరతులు విధిస్తూ బెయిల్ ఇచ్చింది. రూ. 2 లక్షల పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది. ప్రతి సోమవారం హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Also Read: కాటన్‌ క్యాండీ, గోబీ మంచురియాపై నిషేధం.. ఎందుకంటే?

సీబీఐ కోర్టులో విచారణ జరిగే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఉండకూడదని నిబంధన విధించింది. పాస్‌పోర్టును కూడా కోర్టుకు అందచేయాలని ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ వివేకా హత్య కేసులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని 2021 సెప్టెంబరు 17న హైదరాబాదులో అరెస్ట్ చేశారు. దాదాపు మూడేళ్ల తర్వాత రేపు చంచల్ గూడ జైలు నుంచి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పై బయటకు రానున్నారు.

Advertisment
తాజా కథనాలు