AP: విశాఖలో కిడ్నీ రాకెట్ కేసు.. ఎన్.అర్.ఐ ఆసుపత్రికి బిగుస్తున్న ఉచ్చు..!

విశాఖ ఎన్.అర్.ఐ ఆసుపత్రికి ఉచ్చు బిగుస్తోంది. కిడ్నీ మార్పిడి చేస్తామని ఓ వ్యక్తి దగ్గర అడ్వాన్స్ కింద రూ. 10 లక్షలు వసూల్ చేసి మొహం చాటేశారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నీ రాకెట్ కేసులో సీపీ దూకుడు పెంచారు. నిందితులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

AP: విశాఖలో కిడ్నీ రాకెట్ కేసు.. ఎన్.అర్.ఐ ఆసుపత్రికి బిగుస్తున్న ఉచ్చు..!
New Update

Vishaka: విశాఖ ఎన్.అర్.ఐ ఆసుపత్రికి ఉచ్చు బిగుస్తోంది.⁠ కిడ్నీ మార్పిడి కేసులో కీలక పాత్ర పోషించిన ఎన్.అర్.ఐ ఆసుపత్రి.. కిడ్నీ మార్పిడి చేస్తామని చెప్పి ఓ బాధితుడి నుండి అడ్వాన్స్ కింద రూ. 10 లక్షలు వసూల్ చేశారు. అయితే, ఆ తరువాత పది మొహం చాటేశారు. తనకు జరిగిన అన్యాయంపై బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. కిడ్నీ మార్పిడి చేస్తామని అడ్వాన్స్ కింద రూ. 10 లక్షలు వసూల్ మోసం చేశారని వాపోయాడు.

Also Read: ప్రభుత్వాలు మారుతున్నా.. తీరని నీటి కష్టాలు.. ప్రాణాలకు తెగిస్తేనే మంచి నీళ్లు!

మహిళా డాక్టర్‌తో పాటు మరో వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసును సీరియస్ గా తీసుకున్న సీపీ..కిడ్నీ రాకెట్ కేసులో దూకుడు పెంచారు. డీసీపీ-1ఆధ్వర్యంలో 8 మంది సిబ్బందితో విచారణకు స్పెషల్ టీం ఏర్పాటు చేశారు. ⁠⁠నిందితులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

#vishaka
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి