Vinesh Phogaat: పారిస్ ఒలింపిక్స్ లో పతకం కచ్చితంగా వస్తుంది అనుకున్న స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ కేవలం 100 గ్రాముల అధిక బరువు ఉండడం వల్ల ఫైనల్ పోటీలకు ముందు అనర్హతకు గురైన విషయం తెలిసిందే. దాంతో ఈ స్టార్ రెజ్లర్ ద కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ అప్పీల్ చేసుకున్న సంగతి తెలిసిందే. కనీసం తనకు రజత పతకం అయినా ఇవ్వాలని కోరింది.
ఈ అప్పీల్ ను పరిగణలోకి తీసుకున్న కాస్ దాని గురించి విచారించింది. వాయిదాలు వేస్తూ చివరికి ఈ నెల 14న ఆ అంశాన్ని కొట్టి పారేస్తూ తీర్పునిచ్చింది. దానికి గల కారణాన్ని తాజాగా కాస్ వివరించింది. తమ బరువు పరిమితికి అనుగుణంగా ఉండేలా చూసుకోవడం అథ్లెట్ల బాధ్యత అని, ఎట్టిపరిస్థితుల్లోనూ మినహాయింపు ఇవ్వడం కుదరదని చెప్పింది.
'నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. బరువు విషయంలో రూల్స్ అందరికీ ఒకటే. ఎవరికీ మినహాయింపు ఉండదు. పరిమితి దాటకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత అథ్లెట్లదే' అని కాస్ పేర్కొంది. దీంతో వినేశ్ ఒలింపిక్స్ పతకం ఆశలు నీరుగారాయి.
Also Read: జూనియర్ డాక్టర్ కేసు…స్వయంగా రంగంలోకి దిగిన చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్!