మేము ఓటెయ్యం.. తెగేసి చెబుతున్న ఆ ఊర్ల ఓటర్లు!

New Update
Elections : రాష్ట్రంలో నిన్నటితో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ!

ఒకటిరెండు చోట్లు మినహా తెలంగాణలో అంతటా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాజధాని హైదరాబాద్ లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. అయితే కొన్ని చోట్ల ఓటర్లు ఓటేయ్యమంటూ ఖరాఖండిగా చెబుతున్నారు. ఇదే సరైన సమయం అనుకున్నారు కావచ్చు. తమకు డెవలప్ మెంట్ కావాలని కోరుతూ నిరసన వ్యక్తం చేస్తున్న ఘటనలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యంపేట గ్రామంలో పోలింగ్ ను బహిష్కరించారు గ్రామస్తులు. తమ గ్రామంలో డెవలప్ మెంట్ జరగలేదని ఓట్లను బహిష్కరించారు. అటు వైరా నియోజకవర్గంలోనూ రెండు చోట్ల గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. ఏన్కూరు మండలం కొత్త మేడేపల్లి గ్రామంలో రహదారులు తాగునీటి సౌకర్యం, మౌలిక వసతులు 20ఏళ్లుగా ఏర్పాటు చేయలేదని గ్రామస్తులు నిరసన తెలుపుతున్నారు. తమ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఓటు వేయమంటూ భీష్మించుకూర్చున్నారు. దీంతో అధికారులు మాత్రం ఆ గ్రామస్థులను బతిమిలాడుతున్నారు.

ఏన్కూరు మండలంలోనూ ఇలాంటి ఘటనే కనిపించింది. రాజులపాలెం గ్రామం నుంచి శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు నిర్మించాలనే డిమాండ్ నెరవేరకపోవడంతో ఓటేయమని గ్రామస్థులు తీర్మానం చేశారు. దీంతో పోలింగ్ ను బహిష్కరించారు. అటు మహబూబాబాద్ జిల్లాలో డబ్బుల కోసం ఓటర్లు డిమాండ్ చేయడం హాట్ టాపిగ్గా మారింది. బయ్యారం మండలం సంతులాల్ పోడు గ్రామపంచాయతీ పరిధిలోని సంతులాల్ పోడు ఎస్సీ కాలనీ ఓటర్లు డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తాం అంటూ చెప్ారు. దీంతో ఓటు వేయాలని వారిని అధికారులు బతిమిలాడుతున్నారు. ఇప్పటివరకు అక్కడ ఓట్లు పోల్ కాలేదు.

ఇటు బెల్లంపల్లి నియోజకవర్గం కాసిపేట మండలం వరిపేట గ్రామానికి చెందిన ఓటర్లు పోలింగ్ కు దూరంగా ఉన్నారు. ఉదయం 11 గంటల వరకు కేవలం 20 మంది మాత్రమే ఓట్లేశారు. తమ గ్రామాన్ని గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలనిడిమాండ్ చేస్తూ పోలింగ్ బహిష్కరించారు. దీంతో అధికారులు వారితో చర్చలు జరుపుతున్నారు.

ఇది కూడా చదవండి: ఎన్నికల వేళ భద్రాద్రి జిల్లాలో కలకలం.. 25 మందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు..!!

Advertisment
తాజా కథనాలు