AP: విజయవాడ పీసీబీ ఫైల్స్ దహనం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. కేసులో కీలకంగా వ్యవహరించిన పీసీబీ OSD రామారావు ఇంట్లో అధికారులు సోదాలు చేపట్టారు. పీసీబీ చైర్మన్ సమీర్ శర్మ OSD గా పనిచేసిన రామరావుపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది.
Also Read: జగన్‌ను సాగనంపారు.. ఇక రాబోయే రోజుల్లో జరిగేది ఇదే: ఎమ్మెల్యే
కాగా, విజయవాడ – అవనిగడ్డ కరకట్టపై గత వారం కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ది సంస్థలకు (APMDC) చెందిన బస్తాల కొద్ది దస్త్రాలను తగలబెట్టిన సంగతి తెలసిందే. ఇందులో కొన్ని ఫైళ్లు సీఎంఓకు చెందినవి కాగా, మరికొన్ని కాలుష్య నియంత్రణ మండలికి చెందిన హార్డ్ డిస్కులు ఉన్నాయి.
ఫైళ్ల పై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మాజీ ఛైర్మన్ సమీర్ శర్మ ఫోటోలు ఉన్నాయి. దీంతో పెద్దిరెడ్డే ఫైల్స్ దహనం చేయించి ఉంటాడని టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ ఘటనలోని నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.