YCP Vijaysai Reddy:నెల్లూరు కలెక్టరేట్‌లో లోక్ సభ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలనకు హాజరైయ్యారు వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు లోక్ సభ స్థానానికి దాఖలు చేసిన రెండు సెట్ల నామినేషన్లనూ రిటర్నింగ్ అధికారి ఆమోదించారని తెలిపారు. ఈ క్రమంలోనే టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కు సంబంధించి కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశామన్నారు. విదేశాల్లోని పెట్టుబడులకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించలేదన్నారు. ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
Also Read: బిడ్డా గన్ పార్క్ కి రా.. నువ్వో.. నేనో తేల్చుకుందాం!
అదే విధంగా మన దేశంలో ఉన్నటువంటి పెట్టుబడులను కూడా ఆయన వెల్లడించలేదని.. ఏ కంపెనీల్లో వాటాలు ఉన్నాయనే విషయాన్ని కూడా వెల్లడించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్పొరేషన్లు .. కంపెనీలలో లావాదేవీలు ఉన్నట్లయితే వాటిని కూడా వెల్లడించాలన్నారు. నార్తరన్ కోల్డ్ ఫీల్డ్స్.. సింగరేణి కాలరీస్ లలో కాంట్రాక్ట్ ఉందని పేర్కొన్నారు. అందువల్ల ఆయన పోటీకి అనర్హులని రిటర్నింగ్ అధికారికి తెలియజేశామన్నారు. అయితే, ఆయన ప్రాథమికంగా తమ అభ్యంతరాలను తోసిపుచ్చారన్నారు. న్యాయ నిపుణులను సంప్రదించి తదుపరి చర్యలను తీసుకుంటామని వ్యాఖ్యానించారు.