CM Relief Fund: సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అంటే ఏంటి? ఎలా డొనేట్‌ చేయాలి?

తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్‌ ఫండ్స్‌కు విరాళాలు పోటెత్తుతున్నాయి. సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళం ఇవ్వడం ద్వారా వరద బాధితులను ఆదుకోవచ్చు. అందుకే సెలబ్రెటీలు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. అసలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అంటే ఏంటి? పూర్తిగా తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
CM Relief Fund: సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అంటే ఏంటి? ఎలా డొనేట్‌ చేయాలి?

CM Relief Fund: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు ఇటు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలు వరదలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ సమయంలో సినీ సెలబ్రెటిల నుంచి సామాన్యుల వరకు ఎవరికి వారు తమకు తోచిన సాయం చేస్తున్నారు. అటు సినీ స్టార్స్‌ అందరూ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు భారీగా విరాళాలు ఇస్తుండడం మంచి పరిణామం. ఇప్పటికే అల్లు అర్జున్‌, ప్రభాస్‌, చిరంజీవితో పాటు మరికొందరు ప్రముఖులు విరాళాలు అందించారు. నేరుగా రిలీఫ్‌ ఫండ్‌కు విరాళాలు ప్రకటించారు.

Also Read: మరో మావోయిస్టు అగ్రనేత ఎన్‌కౌంటర్!

ఇంతకీ అసలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అంటే ఏంటి? ఎలా డొనేట్‌ చేయాలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..  సీఎం రిలీఫ్‌ ఫండ్‌ (CMRF) 1977 నవంబర్‌ 19న ఉమ్మడి ఏపీలో ప్రారంభమైంది. గ్రామీణ ప్రజలకు ముఖ్యంగా దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్న వారికి ఆపత్కాలంలో సాయం అందించడమే ఈ సహాయ నిధి ముఖ్య ఉద్దేశ్యం. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల బాధితులకు సహాయం చేయడంలో ఈ నిధులు గొప్పగా ఉపయోగపడతాయి. ఎలాంటి వివక్ష లేకుండా నిరుపేదలకు సహాయం చేయడానికి ఈ ఫండ్‌ను ప్రభుత్వం వినియోగిస్తుంటుంది. సంబంధిత పేషెంట్ల వైద్య బిల్లులను రియంబర్స్ చేయడానికి కూడా ఈ ఫండ్‌ను ఉపయోగిస్తారు.

ఏపీలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఆఫీస్‌ సెక్రటేరియట్ వెలగపూడి - అమరావతిలో ఉంది. ఇటు తెలంగాణలోని డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్‌లో ఈ ఆఫీస్‌ ఉంది.

తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళం అందించాలంటే ఈ ( https://www.telangana.gov.in/cm-relief-fund/) వెబ్‌సైట్‌ ద్వారా సాయం చేయవచ్చు. యూపీఐ స్కానెర్‌తో పాటు బ్యాంక్‌ అకౌంట్‌ ద్వారా విరాళం పంపించవచ్చు.

ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళం అందించాలంటే ఈ ( https://apcmrf.ap.gov.in/ )వెబ్‌సైట్‌ ద్వారా సాయం చేయవచ్చు. యూపీఐ స్కానెర్‌తో పాటు బ్యాంక్‌ అకౌంట్‌ ద్వారా విరాళం పంపించవచ్చు.

Advertisment
తాజా కథనాలు