/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/vijay-sai-jpg.webp)
Vijayasai Reddy: వైసీపీని వీడేది లేదని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వైసీపీని ఆయన వీడుతున్నట్టుగా కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా, దీనిపై ఆయన స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ.. తాను పార్టీ మారుతున్నట్టుగా వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు.
I wish to make it clear that I am a loyal, dedicated, and committed worker of the YSRCP. I will remain with YSRCP and work under the leadership of Sri @ysjagan Garu. I condemn the baseless speculation and misinformation being spread by a section of the media about me quitting…
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 28, 2024
వైఎస్ జగన్ నాయకత్వంలోనే పనిచేస్తానని.. వైసీపీలోనే తాను కొనసాగుతానని స్పష్టం చేశారు. వైసీపీకి తాను విధేయత, నిబద్ధత కలిగిన కార్యకర్తగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. వైసీపీని వీడి మరో పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు.