/rtv/media/media_files/2024/12/02/JOWnwnqNg2SQh0SoLkHX.jpg)
సాధారణంగా చలికాలంలో వాతావరణంలోని మార్పుల కారణంగా వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిల్లో శరీరంలో రోగానిరోధక శక్తిని పెంచడానికి ఆహరం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా చలికాలంలో నువ్వులను తీసుకోవడం ఆరోగ్యానికి మరింత ప్రయోజనాకరంగా ఉంటుంది. నువ్వుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ..
శరీరానికి వెచ్చదనం..
చలికాలంలో నువ్వులు శరీరానికి వెచ్చదనాన్ని అందించడంలో సహాయపడుతుంది. నువ్వులు సహజంగా వేడి గుణాన్ని కలిగి ఉంటాయి. రోజు తెల్ల నువ్వులను తినడం ద్వారా శరీరం లోపలి నుంచి వెచ్చగా ఉంటుంది. పాలతో లేదా ఏదైనా లడ్డు రూపంలో నువ్వులను తీసుకోవచ్చు.
రోగానిరోధక శక్తి..
శీతాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధుల బారిన పడుతుంటారు. తెల్ల నువ్వులను రోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలోని జింక్ రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
జీర్ణక్రియ ఆరోగ్యం..
తెల్ల నువ్వుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాదు తెల్ల నువ్వులు చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది.
చర్మం, ఎముకల ఆరోగ్యం..
తెల్ల నువ్వులు చర్మం, ఎముకల ఆరోగ్యానికి ఒక వరం. చల్లని, పొడి గాలుల కారణంగా చర్మం పొడిగా నిస్తేజంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో, నువ్వుల గింజలను రోజూ తీసుకోవడం వల్ల మీ చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. అలాగే నువ్వుల్లోని కాల్షియం ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
Also Read: Earth Orbit: చెత్తతో నిండిపోయిన భూకక్ష్య..ప్రమాదంలో ఉన్నామంటున్న ఐరాస