Vennela Kishore: వెన్నెల కిషోర్ హీరోగా కామెడీ సినిమా

వినోదానికి కేరాఫ్ అడ్రస్ 'వెన్నెల' కిశోర్. మేనరిజమ్స్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, నటనతో కావచ్చు. కామెడీలో వైవిధ్యం చూపిస్తూ, ప్రేక్షకులకు నవ్వులు పంచుతూ అలరిస్తున్నాడు. ఇప్పుడీ హాస్య నటుడు మరోసారి హీరోగా మారాడు. 'వెన్నెల' కిశోర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'చారి 111'.

New Update
Vennela Kishore: వెన్నెల కిషోర్  హీరోగా కామెడీ సినిమా

Vennela Kishore Latest Movie Chaari 111: 'వెన్నెల' కిశోర్ కథానాయకుడిగా బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్న సినిమా 'చారి 111'. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ హీరోగా నటించిన హిట్ సినిమా 'మళ్ళీ మొదలైంది' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో 'వెన్నెల' కిశోర్ సరసన సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్ గా నటిస్తోంది. మురళీ శర్మది ప్రధాన పాత్ర. తాజాగా సినిమాను ప్రకటించడంతో పాటు కాన్సెప్ట్ టీజర్ కూడా విడుదల చేశారు.

యాక్షన్ కామెడీ సినిమా.

ఇదొక యాక్షన్ కామెడీ సినిమా. ఇందులో 'వెన్నెల' కిశోర్ గూఢచారి (స్పై) పాత్రలో కనిపిస్తారు. ఓ సిటీలో జరిగే అనుమానాస్పద ఘటనలను చేధించే రహస్య గూఢచారి పాత్రలో ఆయన లుక్ స్టైలిష్‌గా ఉంటుంది. అలాగే, ఆ పాత్రలో ఓ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అది ఏమిటి? గూఢచారి ఏం చేశాడు? అనేది స్క్రీన్ మీద చూడాలి. గూఢచారి సంస్థ హెడ్‌గా కథలో కీలకమైన పాత్రలో మురళీ శర్మ కనిపిస్తారు. స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం వినోదభరితంగా సాగుతూ ప్రేక్షకుడిని మా సినిమా అలరిస్తుందని చెబుతున్నారు.

ఈ సినిమాలో గందరగోళానికి గురయ్యే స్పై పాత్రలో వెన్నెల కిశోర్ ఆద్యంతం వినోదం అందించబోతున్నాడు. ఈషా పాత్రలో హీరోయిన్ సంయుక్త విశ్వనాథన్, మహి పాత్రలో ప్రియా మాలిక్ నటిస్తున్నారు. హీరోయిన్ ఫైట్స్ కూడా చేస్తుంది. ఈ కథలో చాలా సర్ ప్రైజెస్ ఉన్నాయంటున్నాడు దర్శకుడు.

చంటబ్బాయ్ లో చిరంజీవి తరహా పాత్ర

చాన్నాళ్ల కిందటే హీరోగా మారాడు వెన్నెల కిషోర్. అతడితో పాటు బ్రహ్మానందం వాంటి చాలామంది కమెడియన్లు ఆ సినిమాలో నటించారు. అయితే ఆ మూవీ అతిపెద్ద డిజాస్టర్ అయింది. దాంతో ఇక తను లీడ్ రోల్స్ చేయనని అప్పట్లో ప్రకటించాడు వెన్నెల కిషోర్. చెప్పినట్టుగానే ఇన్నాళ్లూ వాటికి దూరంగా ఉన్నాడు. ఎన్నో ఆఫర్లు తిరస్కరించాడు. అదే టైమ్ లో కామెడీ ఆర్టిస్టుగా బిజీ అయ్యాడు. మళ్లీ ఇన్నేళ్లకు ఈ చంటబ్బాయ్ లోని చిరంజీవి తరహా పాత్రతో హీరోగా మరోసారి ప్రేక్షకులముందుకొస్తున్నాడు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు