TDP: కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు: వీపిఆర్ దంపతులు

తాము పార్టీ వీడుతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు వీపిఆర్ దంపతులు. టీడీపీని వీడే ప్రసక్తే లేదని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు తేల్చి చెప్పారు. కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

New Update
TDP: కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు: వీపిఆర్ దంపతులు
Nellore: తాము పార్టీ వీడుతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వీపిఆర్ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు తేల్చి చెప్పారు. ఆదివారం నెల్లూరులోని విపిఆర్ హౌస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ ఎన్ డి ఏ ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల సోషల్ మీడియాలో తాము తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు, తిరిగి వైసీపీలో చేరుతున్నట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. అది అంతా అబద్ధమని, తాము తెలుగుదేశం పార్టీ తరఫునే పోటీ చేస్తున్నామన్నారు. మాకు వస్తున్న అశేష అభిమానాన్ని తట్టుకోలేక.. అవతల పార్టీ నుంచి భారీగా మా పార్టీలో చేరే విషయాన్ని జీర్జించుకోలేక ఈ అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు.

Also Read: వయాగ్ర వద్దు.. జామ ముద్దు.. శృంగారానికి సహజ మందు!

రాబోయే రోజుల్లో కచ్చితంగా జరిగే మా విజయాన్ని అంగీకరించలేక, వాళ్ల ఓటమిని ఒప్పుకోలేక మాపై నమ్మకం పెట్టుకున్న ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇలా చేస్తున్నారన్నారు. మేము అవతల పార్టీలోకి తిరిగి వెళుతున్నామని అబద్దపు ప్రచారాలు సృష్టిస్తున్నారన్నారు. ఇది పూర్తిగా అవాస్తవమని.. కొందరు అవతల పార్టీ వారు పనిగట్టుకుని మరీ మాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. కాబట్టి ఇందులో ఏమాత్రం నిజం లేదని.. మాకు టీడీపీ పార్టీలో ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు.

Also Read: IAS అయిన మిస్ ఇండియా ఫెమినా.. కోచింగ్ లేకుండానే UPSC క్రాక్‌ చేసిన బ్యూటీ..!

 అందరితోనూ మంచి సఖ్యత ఉందని, పార్టీలో మాకు గౌరవం ఉందని తెలిపారు. మా విజయం మీద ఎలాంటి అనుమానం లేదని, ప్రజల నుంచి వస్తున్న స్పందనే అందుకు నిదర్శనమన్నారు. కావున తెలుగుదేశం పార్టీ అభిమానులకు, మా కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెబుతున్నామని, ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.
Advertisment
తాజా కథనాలు