Vehicle Recall: హ్యుందాయ్ వేలాది కార్లను రీకాల్ చేస్తోంది! ఆ కార్లలో మీ కారు ఉందా?

ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ పంప్ కంట్రోలర్ తప్పుగా ఉండవచ్చనే కారణంతో హ్యుందాయ్ 7698 కార్లను రీకాల్ చేస్తోంది. ఫిబ్రవరి 13, 2023-జూన్ 06, 2023 సంవత్సరాల మధ్యలో తయారైన క్రెటా, వెర్నా మోడల్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది హ్యుందాయ్.

Vehicle Recall: హ్యుందాయ్ వేలాది కార్లను రీకాల్ చేస్తోంది! ఆ కార్లలో మీ కారు ఉందా?
New Update

Vehicle Recall: సాంకేతిక లోపం కారణంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా  దేశంలో 7698 వాహనాలను రీకాల్ చేసింది. ఈ రీకాల్‌లో సెడాన్ సెగ్మెంట్ నుండి కంపెనీ ప్రముఖ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (SUV) క్రెటా అలాగే, వెర్నా కూడా ఉన్నాయి. రెండు కార్లలోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లతో కూడిన CVT ఆటోమేటిక్ వేరియంట్‌లను మాత్రమే కంపెనీ రీకాల్ చేసింది. హ్యుందాయ్ ఈ రీకాల్ గురించి రోడ్డు రవాణా - రహదారుల మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. క్రెటా - వెర్నా ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ పంప్ కంట్రోలర్ తప్పుగా ఉండవచ్చని హ్యుందాయ్ తెలిపింది. ఇది CVT గేర్‌బాక్స్‌లోని ఎలక్ట్రానిక్ ఇంధన పంపు పనితీరును ప్రభావితం చేయవచ్చు అని చెబుతున్నారు. ఈ రీకాల్‌లో గత సంవత్సరం ఫిబ్రవరి 13, 2023, జూన్ 06, 2023 మధ్య తయారయిన రెండు కార్లలోని 7,698 యూనిట్లు ఉన్నాయి. వాహన రీకాల్‌(Vehicle Recall)పై స్వచ్ఛంద కోడ్ ప్రకారం ఈ చర్య తీసుకున్నారు. 

Also Read: ఈ బ్యాంకుల్లో తక్కువ వడ్డీరేటుకే హోమ్ లోన్స్.. సోలార్ ప్యానెల్ కూ ఈజీ లోన్స్.. 

కస్టమర్ నుంచి ఎటువంటి ఛార్జీ ఉండదు..
హ్యుందాయ్ నుంచి కస్టమర్లకు వ్యక్తిగతంగా కాల్స్, మెసేజ్ లు వెళుతున్నాయి. “బాధిత కస్టమర్‌లు అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయడానికి డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు లేదా 1800-114-645 (టోల్-ఫ్రీ)లో హ్యుందాయ్(Vehicle Recall) కాల్ సెంటర్‌కు కాల్ చేయవచ్చు. కారులో పరీక్ష తర్వాత లోపం సరిచేస్తారు.  లోపభూయిష్ట భాగాన్ని మార్చడం విషయంలో వాహన యజమానులకు తెలియచేయడం జరుగుతుంది. లోపాలను సరిచేయడానికి లేదా విడిభాగాలను భర్తీ చేయడానికి కస్టమర్ నుండి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయరు” అంటూ హ్యుందాయ్ తన కాల్స్, మెసేజ్ లలో చెబుతోంది. 

దేశంలో పెద్ద సంఖ్యలో వాహనాల రీకాల్ కేసులు
బాలెనో-వ్యాగన్ఆర్ రీకాల్:
జూలై 2020లో, మారుతి 1,34,885 యూనిట్ల వ్యాగన్ఆర్ - బాలెనోలను రీకాల్(Vehicle Recall) చేసింది. ఈ మోడల్‌లు నవంబర్ 15, 2018 - అక్టోబర్ 15, 2019 మధ్య తయారయినవి.  ఇంధన పంపులో లోపం కారణంగా కంపెనీ వాహనాలను రీకాల్ చేసింది.

మారుతి ఎకో రీకాల్: నవంబర్ 2020లో, కంపెనీ ఎకో  40,453 యూనిట్లను రీకాల్ (Vehicle Recall)చేసింది. వాహనం హెడ్‌ల్యాంప్‌లో స్టాండర్డ్ సింబల్ మిస్ అయిన కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. రీకాల్ నవంబర్ 4, 2019 - ఫిబ్రవరి 25, 2020 మధ్య తయారు చేయబడిన Eecoని కవర్ చేస్తుంది.

మహీంద్రా పికప్ రీకాల్: 2021లో, మహీంద్రా & మహీంద్రా 29,878 యూనిట్ల వాణిజ్య పికప్ వాహనాలను రీకాల్(Vehicle Recall) చేసింది. జనవరి 2020 - ఫిబ్రవరి 2021 మధ్య తయారు చేసిన కొన్ని పికప్ వాహనాల్లో ఫ్లూయిడ్ పైప్‌ను మార్చాల్సిన అవసరం ఉందని కంపెనీ తెలిపింది.

మహీంద్రా థార్ రీకాల్: మహీంద్రా & మహీంద్రా ఫిబ్రవరి 2021లో దాని ఆఫ్‌రోడ్ SUV థార్ డీజిల్ వేరియంట్ 1577 యూనిట్లను రీకాల్ (Vehicle Recall)చేసింది. ప్లాంట్‌లోని మెషిన్‌లో లోపం కారణంగా ఈ భాగాలు దెబ్బతిన్నాయని కంపెనీ తెలిపింది. అన్ని యూనిట్లలోనూ  సెప్టెంబర్ 7 - డిసెంబర్ 25, 2020 మధ్య తయారైన థార్ లను రీకాల్ చేశారు. 

రాయల్ ఎన్‌ఫీల్డ్ రీకాల్: మే 2021లో, షార్ట్ సర్క్యూట్ భయంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ 2,36,966 యూనిట్ల బుల్లెట్ 350, క్లాసిక్ 350 - మీటోర్ 350లను రీకాల్(Vehicle Recall) చేసింది. ఇవన్నీ డిసెంబర్ 2020 ఏప్రిల్ 2021 మధ్య తయారు చేసివి. 

#automobile #cars-recall #hyndai
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe