Vegan Technology: ఇటీవల వీగనిజానికి బాగా ఫాలోయింగ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. జీవకారుణ్య సంస్థలతో పాటు పెట్ లవర్స్ చాలా మంది వీగనిజాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అయితే, అది కేవలం ఆహారం వరకే పరిమితం కాకుండా, లైఫ్ స్టైల్ లో భాగమవుతోంది. ఇప్పుడు మార్కెట్ లో ఓ కొత్త ట్రెండ్ మొదలవబోతోంది. అవే వీగన్ బ్యాగ్స్.
ఇది కూడా చదవండి: మీ రిలేషన్ బోర్ కొడుతోందా.. మళ్లీ కొత్తగా ఆస్వాదించాలంటే ఇలా చేయండి
జంతువుల చర్మంతో తయారు చేసే సంచులకు బదులు వాటికి ప్రత్యామ్నాయంగా మొక్కల వ్యర్థాలతో వివిధ వస్తువులు తయారు చేస్తు్న్నారు. బ్యాగ్స్ మాత్రమే కాదు.. పర్సులు, బూట్లు, చెప్పులు, హాండ్ బ్యాగులను కూడా వీగన్ తరహాలోనే తయారుచేస్తూ మార్కెట్లోకి తేవడానికి రెడీ అవుతున్నారు. తిరువనంతపురానికి చెందిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (సీఎస్‌ఐఆర్) ఈ తరహా బ్యాగులను అభివృద్ధి చేసింది.
ప్లాంట్ బేస్డ్ వీగన్ సాంకేతికతతో రూపుదిద్దిన బూట్లు, చెప్పులు, పర్సులు, జాకెట్లు, హాండ్ బ్యాగులను మైసూరులో జరుగుతున్న అంతర్జాతీయ ఆహార సమ్మేళనంలో వారు ప్రదర్శించారు. చెరకు పిప్పి, వరి, గోధుమ పొట్టు, మామిడి టెంక, పీచు వంటి పదార్థాలతో ఈ వస్తువులను తయారుచేశారు.
ఇది కూడా చదవండి: బాడీ ఫ్యాట్ ఇబ్బంది పెడుతుందా.. ఈ చిన్న చిట్కాతో కొవ్వు కరిగిపోతుంది తెలుసా..!
తోలు, సింథటిక్ వంటి పదార్థాలతో తయారు చేసిన సాధారణ సామానుతో పోలిస్తే వీటి తయారీకి పెట్టుబడి కూడా తక్కువే అవుతుందని సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు . దాదాపు మూడేళ్లు మన్నుతాయట. భూమిలో సులభంగా కలిసిపోవడంతో వాటి వల్ల పర్యావరణానికి కూడా ఎలాంటి హానీ లేదంటున్నారు. ఈ తరహా ముడి సరకుతో జౌళి, ఫ్యాషన్, మోటారు వాహనాల్లో వాడే కొన్ని వస్తువులను కూడా తయారు చేయొచ్చంటున్నారు సంస్థ నిపుణులు.