Varun-Lavanya Marriage: అంగరంగ వైభవంగా వరుణ్-లావణ్యల పెళ్లి

కాసేపట్లో ఇటలీలోని టుస్కానీ లో ఘనంగా మెగా కపుల్ వరుణ్, లావణ్య పెళ్లి. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు పూర్తి చేసుకున్న ఈ జంట ఈ రోజు మధ్యాహ్నం 2:48 గంటలకు మెగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఒకటికానున్నారు.

Varun-Lavanya Marriage: అంగరంగ వైభవంగా వరుణ్-లావణ్యల పెళ్లి
New Update

Varun-Lavanya Marriage: కాసేపట్లో ఇటలీలోని టుస్కానీ లో అంగ రంగ వైభవంగా మెగా కపుల్ వరుణ్, లావణ్య పెళ్లి. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ పూర్తి చేసుకున్న మెగా కపుల్ పెళ్లి మధ్యాహ్నం 2:48 గంటలకు మెగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరగనుంది. ఇటలీలో జరగబోతున్న ఈ పెళ్ళికి పలువు సినీ సెలెబ్రెటీలు కూడా హాజరు కానున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ పెళ్లి వేడుకల్లో సందడిగా ఉన్నారు.

publive-image

నిన్న జరిగిన హల్దీ, మెహందీ వేడుకల్లో చిరంజీవి- సురేఖ దంపతులు, నాగబాబు- పద్మజ దంపతులతో పాటు రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహ, సాయి ధరమ్ తేజ్, నిహారిక ఇతర మెగా కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. ఇటలీలో జరుగుతున్న వరుణ్, లావణ్య పెళ్లి వేడుకలకు హీరో నితిన్- షాలిని దంపతులు కూడా హాజరయ్యారు. హల్దీ ఫంక్షన్ తర్వాత మెహందీ, సంగీత్ వేడుకలు కూడా చాలా సందడిగా జరిగాయి. సంగీత్ లో మెగా ఫ్యామిలీ డాన్సులు వేస్తూ సందడి చేశారు.

publive-image

ఇటలీలో జరుగుతున్న వరుణ్ లావణ్య పెళ్ళికి మెగా, అల్లు ఫ్యామిలీతో పాటు పలువురు సెలెబ్రెటీలు కూడా హాజరుకానున్నారు. ఇప్పటికే హీరో నితిన్-షాలిని దంపతులు ఇటలీ చేరుకున్నారు. సమంత, నాగ చైతన్య , రష్మిక కూడా ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొననున్నట్లు సమాచారం.

publive-image

publive-image

publive-image


Also Read: Varun-Lavanya Marriage:వరుణ్-లావణ్యల పెళ్ళికి గెస్ట్ లుగా నాగచైతన్య, సమంత

#varun-tej #varun-lavanya-marriage #lavanya-marraige-date
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe