/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-76-jpg.webp)
Varun-Lavanya Marriage: కాసేపట్లో ఇటలీలోని టుస్కానీ లో అంగ రంగ వైభవంగా మెగా కపుల్ వరుణ్, లావణ్య పెళ్లి. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ పూర్తి చేసుకున్న మెగా కపుల్ పెళ్లి మధ్యాహ్నం 2:48 గంటలకు మెగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరగనుంది. ఇటలీలో జరగబోతున్న ఈ పెళ్ళికి పలువు సినీ సెలెబ్రెటీలు కూడా హాజరు కానున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ పెళ్లి వేడుకల్లో సందడిగా ఉన్నారు.
నిన్న జరిగిన హల్దీ, మెహందీ వేడుకల్లో చిరంజీవి- సురేఖ దంపతులు, నాగబాబు- పద్మజ దంపతులతో పాటు రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహ, సాయి ధరమ్ తేజ్, నిహారిక ఇతర మెగా కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. ఇటలీలో జరుగుతున్న వరుణ్, లావణ్య పెళ్లి వేడుకలకు హీరో నితిన్- షాలిని దంపతులు కూడా హాజరయ్యారు. హల్దీ ఫంక్షన్ తర్వాత మెహందీ, సంగీత్ వేడుకలు కూడా చాలా సందడిగా జరిగాయి. సంగీత్ లో మెగా ఫ్యామిలీ డాన్సులు వేస్తూ సందడి చేశారు.
ఇటలీలో జరుగుతున్న వరుణ్ లావణ్య పెళ్ళికి మెగా, అల్లు ఫ్యామిలీతో పాటు పలువురు సెలెబ్రెటీలు కూడా హాజరుకానున్నారు. ఇప్పటికే హీరో నితిన్-షాలిని దంపతులు ఇటలీ చేరుకున్నారు. సమంత, నాగ చైతన్య , రష్మిక కూడా ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొననున్నట్లు సమాచారం.
View this post on Instagram
Also Read: Varun-Lavanya Marriage:వరుణ్-లావణ్యల పెళ్ళికి గెస్ట్ లుగా నాగచైతన్య, సమంత