/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-26T142713.640-jpg.webp)
Vanitha Vijay Kumar: తమిళ నటి వనిత విజయ్ కుమార్ తమిళ బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఈ నటి కంటెస్టెంట్ గా వెళ్లి.. బయటకు వచ్చినప్పటి నుంచి ప్రతీ సీజన్ కు తన యు ట్యూబ్ ఛానెల్ లో రివ్యూస్ చెప్పడం మొదలు పెట్టారు. ప్రస్తుతం తమిళంలో బిగ్ బాస్ సీజన్ 7 జరుగుతోంది. గత సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ చాలా ఇంట్రెస్టింగ్ సాగుతుంది. ఈ సీజన్ లోని కంటెస్టెంట్ ప్రదీప్ ఆంటోనికీ హోస్ట్ కమల్ హాసన్ రెడ్ కార్డు చూపించి బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ చేశారు. ఈ విషయం పై ప్రదీప్ ఫ్యాన్స్ రక రకాలుగా కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే.. నటి వనిత విజయ్ కుమార్ ప్రదీప్ ఫ్యాన్ నా పై దాడి చేశారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అయితే నటి వనిత విజయ్ కుమార్ ప్రతీ సీజన్ లానే.. ఈ సీజన్ కూడా రాత్రి ఎపిసోడ్ పూర్తయ్యాక.. రివ్యూ చెప్పి.. ఆ తర్వాత డిన్నర్ చేసి.. అక్క ఇంట్లో కార్ పార్క్ చేసి వస్తుండగా.. అదే సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి.."రెడ్ కార్డ్ చూపిస్తారా" అంటూ నటి వనిత పై దాడి చేశాడట. ఈ విషయాన్నీ నటి వనిత విజయ్ కుమార్ తన సోషల్ మీడియా వేదికగా గాయాలతో ఉన్న ఫొటోను చేశారు. ఇది కేవలం గేమ్ షో మాత్రమే.. ఇలా చేయడం సరి కాదని తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇది చూసిన కొంత మంది నెటిజన్లు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని కామెంట్స్ చేస్తుంటే.. మరి కొంతమంది ఇది కేవలం సింపతీ కోసం మాత్రమే అని పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Bravely posting my attack . #BiggBoss7Tamil is just a game show on tv . I don’t deserve to go thru this pic.twitter.com/X6rI8io4GB
— Vanitha Vijaykumar (@vanithavijayku1) November 26, 2023
Also Read: Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఇంట్లో ప్రియాంక ఫ్లాప్.. అశ్విని షాకింగ్ కామెంట్స్..!