Vande Bharat Express: పాలమూరు పట్టాలపై పరుగులు పెట్టిన వందే భారత్ రైలు..

ఒకప్పుడు వలసల జిల్లా, వెనకబడిన జిల్లాగా పేరున్న మహబూబ్ నగర్ జిల్లా మీదుగా వందే భారత్ రైలు పరుగులు పెట్టడం జిల్లా ప్రజల అదృష్టం అని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలోనే మహబూబ్ నగర్ కు డబ్లింగ్ లైన్ పూర్తి చేసిన రైల్వే శాఖ.. మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ సుందరీకరణ కు కూడా కోట్ల రూపాయలను మంజూరు చేసింది.

New Update
Vande Bharat Express: పాలమూరు పట్టాలపై పరుగులు పెట్టిన వందే భారత్ రైలు..

Vande Bharat Express: ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) వర్చువల్ గా ప్రారంభించిన వందే భారత్ ట్రైన్(Vande Bharat Train) కాచిగూడ నుండి పాలమూరు పట్టాల పైకి రయ్ రయ్ మంటూ దూసుకొచ్చింది. ఈ వందే భారత్ ట్రైనుకు బిజెపి(BJP) నాయకులు ఘన స్వాగతం పలికారు. పాలమూరు రంగారెడ్డి ట్రైన్ ప్రత్యేకతల పై RTV స్పెషల్ స్టోరీ. పాలమూరు జిల్లాకు వందే భారత్ ట్రైన్ రావడంతో ట్రైన్ ను చూసేందుకు, ఎక్కేందుకు స్థానికులు పెద్ద ఎత్తున మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ కు వచ్చారు. ఎన్నో అద్భుతమైన ఫ్యూచర్స్ తో గుడ్ లుకింగ్ తో ఉన్న వందే భారత్ ట్రైన్ ను ఎక్కిన ప్రయాణికులు చాలా అనుభూతి చెందుతున్నారు. పట్టాలపై ప్రయాణించే ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నట్లు ఉందని తెలుపుతున్నారు..

మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న వందే భారత్ ట్రైన్ కు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ప్రయాణికులతో కలిసి గద్వాల వరకు డీకే అరుణ వందే భారత్ ట్రైన్ లో ప్రయాణించింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక రోడ్ల విస్తరణ శరవేగంగా అవుతోంది. దానితో పాటు డబులింగ్ లైన్లు కూడా అవుతున్నాయి. నేడు 9 వందే భారత్ రైళ్ళను ప్రధాని వర్చువల్ గా ప్రారంభించారు. రవాణా వ్యవస్థకు కేంద్రం పెద్దపీట వేస్తుంది డీకే అరుణ అన్నారు..

ఒకప్పుడు వలసల జిల్లా, వెనకబడిన జిల్లాగా పేరున్న మహబూబ్ నగర్ జిల్లా మీదుగా వందే భారత్ రైలు పరుగులు పెట్టడం జిల్లా ప్రజల అదృష్టం అని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలోనే మహబూబ్ నగర్ కు డబ్లింగ్ లైన్ పూర్తి చేసిన రైల్వే శాఖ.. మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ సుందరీకరణ కు కూడా కోట్ల రూపాయలను మంజూరు చేసింది. నేడు వందే భారత్ ట్రైన్ ను మహబూబ్ నగర్ నుండి నడిపిస్తోంది.. ఇదంతా జిల్లా ప్రజలు హర్షించదగ్గ విషయమని అన్నారు..

వందే భారత్ ట్రైన్లో ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించారు. ముఖ్యంగా కూర్చునే సీట్ల విషయానికొస్తే చాలా ప్లెక్సీబుల్ గా అమర్చారు. ప్రయాణికులకు ఎటువైపుకు కంఫర్ట్ ఉంటే అటువైపుకు తిప్పుకునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రయాణం చేసేటప్పుడు మొబైల్ ఫోన్లో చార్జింగ్ పెట్టుకునేందుకు కూడా వీలుగా చార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. ఆటోమేటిక్ డోర్ లాకింగ్ సిస్టంను ప్రవేశపెట్టారు. ట్రైన్ మొత్తం ఎసి బోగీలు 8 భోగీలు ఉన్నాయి. ప్రయాణికులు నిద్రపోవడానికి ఆహారం తినడానికి ఎంతో సౌకర్యవంతంగా ఈ ట్రైన్ డిజైన్ చేశారు.

ఎప్పుడెప్పుడు పాలమూరు పట్టాలపైకి వందే భారత్ ట్రైన్ దూసుకు వస్తుంది అని ఎదురుచూసిన పాలమూరు జిల్లా వాసుల కల నేడు నెరవేరింది. ప్రతిరోజు కాచిగూడ నుంచి యశ్వంత్పూర్ కు ఈ ట్రైన్ ప్రయాణం చేస్తుంది. దూర ప్రయాణాలు చేసే ప్రయాణికులకు ఈ ట్రైన్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. సూపర్ ఆకట్టుకున్నడంతో పాటు ఎన్నో సౌకర్యాలు ఉన్న ఈ సూపర్ స్పెషాలిటీ ట్రైన్ నిత్యం పాలమూరు జిల్లా నుంచి నడవడం తో జిల్లా వాసులు హర్షిస్తున్నారు.

Also Read:

Chandrababu: చంద్రబాబుకు దొరకని రిలీఫ్.. రేపు మెన్షన్ చేయాలన్న సుప్రీం ధర్మాసనం..

mynampally:మైనంపల్లి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం

Advertisment
Advertisment
తాజా కథనాలు