Breaking: ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ సక్సెస్.. బయటికి వచ్చిన 41 మంది కార్మికులు.! ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ సక్సెస్ అయింది. ఓ టన్నెల్ లో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు బయటికి వస్తున్నారు. 17 రోజుల పాటు టన్నెల్ లో చిక్కుకుపోయిన కార్మికుల కోసం వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. By Jyoshna Sappogula 28 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Uttarkashi Tunnel Rescue: ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ సక్సెస్ అయింది. నవంబర్12న ఉత్తరాఖండ్ లోని ఓ టన్నెల్ లో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు సురక్షితంగా బయటికి వచ్చేశారు. గత 17 రోజులుగా అందులో చిక్కుకుపోయిన కార్మికులు ఎట్టకేలకు సొరంగం నుండి బయటకు రానుండడంతో వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక కార్మికులను తీసుకొచ్చేందుకు NDRF, SDRF సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. వచ్చిన కార్మికులను వచ్చినట్టుగానే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అందరూ సురక్షితంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. Also Read: ఏపీని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారు.! కాగా, ఉత్తరాఖండ్ లోని చార్ ధామ్ క్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాలను కలుపుతూ 4.5 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. దీన్ని సిల్క్యారా టన్నెల్ అని పిలుస్తారు. చార్ ధామ్ ప్రాజెక్టులో భాగంగా ఈ డబుల్ లేన్ టన్నెల్ నిర్మాణం చేపట్టారు. అయితే, నవంబరు 12న సిల్క్యారా ప్రాంతం వైపు టన్నెల్ కూలిపోయింది. 205వ మీటరు నుంచి 260వ మీటరు వరకు టన్నెల్ మూసుకుపోయింది. అప్పటికే లోపల కొందరు కార్మికులు పనిచేస్తున్నారు. వారు బయటికి వచ్చే మార్గంలేక అందులోనే చిక్కుకుపోయారు. అప్పటి నుంచి వారికి ఓ పైపు ద్వారా ఆహారం సరఫరా చేస్తున్నారు. వారు నీరసపడిపోకుండా మంచి పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తూ వచ్చారు. డ్రై ఫ్రూట్స్, మల్టీవిటమిన్ మాత్రలు, డిప్రెషన్ కు లోనవ్వకుండా యాంటీడిప్రసెంట్ ఔషధాలు కూడా పంపించారు. Also read: ఒక వ్యక్తి పేరు విని అవాక్కయిన మంత్రి విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్.! కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకువచ్చేందుకు అమెరికాకు చెందిన ప్రత్యేక యంత్రాలను రంగంలోకి దించారు. అండర్ గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్నాల్డ్ డిక్స్ స్వయంగా రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్నారు. అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది శ్రమ ఫలించింది. కార్మికులను క్షేమంగా బయటికి తీసుకువచ్చేందుకు ఇన్నాళ్లకు మార్గం సుగమం అయింది. #uttarkashi-tunnel-rescue మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి