బాత్రూంలోని గీజర్ తో జాగ్రత్త! బాత్‌రూమ్‌లో గీజర్ తో జాగ్రత్తలు వహించాలని నిపుణులు చెబుతున్నారు. గీజర్ ను వాడిన తర్వాత ఆఫ్ చేయకపోతే అది పేలే ప్రమాదముందని వారు అంటున్నారు. ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేపించాలని..దాని నుంచి వచ్చే కార్బన్ డయాక్సైడ్ బయటికి పంపించేలా ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను ఏర్పాటు చేసుకోవాలంటున్నారు. By Durga Rao 24 Jul 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి పాత మోడళ్ల గీజర్లు వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా మంది గీజర్‌ని ఆన్ చేసి ఆఫ్ చేయకపోవడంతో వారు డేంజర్ లో పడుతున్నారు. ఎందుకంటే గీజర్ ఎక్కువసేపు ఆన్‌లో ఉంచితే బాగా హీట్ అయ్యి పేలిపోతుంది. అందువల్ల దీనిని ఆఫ్ చేయడం మర్చిపోకుండా ఉండాలి.అవసరమైతే అలారం పెట్టుకుని దీన్ని ఆఫ్ చేయాలి. ప్రస్తుతం ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యే గీజర్లు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి వాటిని కొనుగోలు చేయడం చాలా సేఫ్.ఆటోమెటిగ్గా ఆఫ్ అయ్యే గీజర్ కొన్నా కూడా అప్పటికప్పుడు దాన్ని ఆఫ్ చేసుకోవడం మంచిది. గీజర్ పాత మోడల్ అయినట్లయితే ఎప్పటికప్పుడు దాన్ని ఆఫ్ చేస్తూ ఉండాలి.తరచుగా సర్వీసింగ్, రిపేర్ కూడా చేస్తే ప్రమాదాలను అరికట్టవచ్చు. ఈ యూట్యూబ్ వీడియోలు చూసి రిపైర్ చేయటం చేయకండి.ఇది అత్యంత ప్రమాదకరం. ఈ విషయంలో టెక్నీషియన్ల సహాయం తీసుకోవడం తప్పనిసరి.లేదంటే ఫిట్టింగ్ విషయంలో చిన్న పొరపాటు జరిగినా అవి షాక్ కొట్టే ప్రమాదం లేకపోలేదు. అలానే ఏమైనా రిపేర్ వస్తే టెక్నీషియన్నే పిలిపించాలి.గీజర్‌లో ఉండే బ్యూటేన్, ప్రొపేన్ అనే గ్యాసెస్ కార్బన్ డయాక్సైడ్‌ను ప్రొడ్యూస్ చేస్తాయి.ఈ గ్యాస్ వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది కనుక ఆ గ్యాస్ ను బయటికి పంపించేలా బాత్‌రూమ్‌లో ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం. #dangerous-geyser మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి