Hair Care Tips: జుట్టు బలంగా, అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మీ జుట్టును అందంగా మార్చుకోవాలనుకుంటే కాఫీని ఉపయోగించవచ్చు. కాఫీ తాగడానికి రుచికరంగా ఉండటమే కాకుండా జుట్టుకు కూడా మేలు చేస్తుంది. కాఫీలో యాంటీఆక్సిడెంట్లు, కెఫిన్ ఉంటాయి. ఇది మూలాల నుంచి జుట్టును బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. జుట్టును బలోపేతం చేయడమే కాకుండా.. వాటిని పొడవుగా, మందంగా చేయడంలో కూడా ఇది చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. కాఫీ జుట్టుకు మాత్రమే కాకుండా ముఖానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ఉపయోగం గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
జుట్టుకు కాఫీ ప్రయోజనాలు:
- జుట్టుకు కాఫీని అప్లై చేయాలంటే ముందుగా ఒక గిన్నెలో కాఫీ తీసుకుని అందులో కండీషనర్, కొబ్బరినూనె బాగా కలపాలి. ఈ పేస్ట్‌ను తడి జుట్టుపై 30 నిమిషాల పాటు అప్లై చేసి, ఆపై షాంపూతో కడగాలి. ఇలా చేయడం వల్ల జుట్టు బలంగా మారుతుంది.
- జుట్టు రాలడం గురించి ఆందోళన చెందుతుంటే.. రెండు టేబుల్ స్పూన్ల గ్రౌండ్ కాఫీ, ఒక చెంచా అలోవెరా జెల్, ఒక చెంచా తేనె వేసి వాటిని బాగా కలపాలి. ఈ పేస్ట్‌ను జుట్టుపై 20 నిమిషాల పాటు అప్లై చేసి ఆపై జుట్టును కడగాలి.
- జుట్టును బలంగా, మెరిసేలా చేయాలనుకుంటే.. ఒక కప్పు కాఫీలో 1 కప్పు నీరు కలపాలి.. దీన్ని స్ప్రే బాటిల్‌లో నింపి జుట్టుపై స్ప్రే చేయాలి. ఆపై జుట్టును ఆరబెట్టాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మెరుస్తూ అందంగా మారుతుంది.
- ప్రతి ఒక్కరి జుట్టు రకం భిన్నంగా ఉంటుంది. కొంతమందికి కాఫీ వాడకం వారి జుట్టుకు సరిపోతుంది. మరికొందరికి ఇది వారి జుట్టుకు హాని కలిగిస్తుంది. దీన్ని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయాలి. దీన్ని ఉపయోగించడం వల్ల కొంతమందికి జుట్టు రాలడం వంటి సమస్యలు ఎదురవుతాయని గుర్తుంచుకోవాలి. ఇది జరిగితే.. ఖచ్చితంగా మంచి ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఏ కలర్ ద్రాక్ష మంచిది? ఎందులో విటమిన్లు ఎక్కువ ఉన్నాయో తెలుసుకోండి