UPSC CAPF 2024 : ఢిల్లీ(Delhi) లోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ..సెంట్రల్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ లో ఉద్యోగాలకు 2024 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ పరీక్ష ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో - టిబెటన్ బోర్డర్ పోలీస్ , సశస్త్ర సీమా బల్ లో 506 అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
డిగ్రీ పూర్తైన యువతీయువకులు ఈ పోస్టులకు ఆన్ లైన్ లో అప్లై(Apply Online) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తులకు చివరి తేదీ , తదితర వివరాలను వెబ్‌సైట్ లో చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 506
బీఎస్‌ఎఫ్- 186
సీఆర్‌పీఎఫ్- 120
సీఐఎస్‌ఎఫ్- 100
ఐటీబీపీ- 58
ఎస్‌ఎస్‌బీ- 42
ఇతర సమాచారం :
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయో పరిమితి: 01-08-2024 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (పేపర్ 1, పేపర్ 2), ఫిజికల్ స్టాండర్డ్స్/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.200 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: మే 14, 2024
దరఖాస్తు సవరణ తేదీలు: మే 15 నుంచి 21 వరకు.
రాత పరీక్ష తేదీ: ఆగస్టు 4, 2024.
Also read: సరిహద్దులు దాటిన మానవత్వం…పాక్ యువతికి భారతీయుని గుండె!